Breaking News

మహానందిలో మరోసారి చిరుత కలకలం

Published on Thu, 06/27/2024 - 04:28

మహానంది: మహానంది గోశాల వద్ద  బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చిరుతపులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆలయ ఏఈఓ ఓంకారం వెంకటేశ్వరుడు, సిబ్బంది వెంటనే నంద్యాల జిల్లా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ దినేష్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌ఓ హైమావతి, ఎఫ్‌బీఓ ప్రతాప్‌లకు సమాచారం అందించారు.  వారు మహానంది గోశాల వద్దకు చేరుకుని చిరుతపులి సంచరించిన ప్రదేశం, పాదముద్రలను గుర్తించారు. 

ఇదిలా ఉండగా.. నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని శిరివెళ్ల మండలం పచ్చర్ల  సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి దాడిలో మంగళవారం ఓ మహిళ మృతి చెందిన విషయాన్ని మరువక ముందే తాజా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఘటనతో పచ్చర్ల వద్ద నల్లమలలో అటవీశాఖ అధికారులు చిరుతపులి కోసం బోను, పది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. 

అయితే అటుగా సంచరించే చిరుతపులి అంతటా తిరుగుతుందని, బోనులోకి మాత్రం రావడం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. గతంలోనూ మహానంది, పచ్చర్ల ప్రాంతాల్లో చిరుతలు సంచరించగా.. ఈ గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయనే విషయాలపై అటవీశాఖ అధికారులు ఇప్పటికీ గోప్యత పాటిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 


ప్రకాశంలో చిక్కిన చిరుత 
ఊపిరి పీల్చుకున్న అధికారులు, స్థానికులు 
ప్రకాశం జిల్లా దేవనగరం సమీపంలో ఘటన 
గిద్దలూరు రూరల్‌: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం సమీపంలో ఓ చిరుతపులి స్థానికులకు కంటబడడంతో భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు చిరుతపులిని బంధించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.  నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుతపులి దేవనగరం గ్రామ శివారులో మేకలు మేపుకునేవారి కంటపడింది. దీంతో వారు కేకలు వేయడంతో చిరుతపులి అక్కడే ఉన్న ఓ పాడుబడిన బావిలోకి దిగింది.

దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో డిప్యూటీ డైరెక్టర్‌ వై.వి.నరసింహారావు, రేంజి ఆఫీసర్‌ కుమార్‌రాజ రెస్క్యూ టీమ్‌ సిబ్బందితో సహా  ఘటనా స్థలానికి చేరుకుని బావి చుట్టూ వలచుట్టి చిరుతను బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన చిరుతను బోనులో బంధించి అడవిలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)