Breaking News

అనుమానం.. పెనుభూతమై..

Published on Tue, 01/27/2026 - 05:12

పెద్దతిప్పసముద్రం: అనుమానం పెనుభూతమైంది. ప్రియురాలు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె ఇంట్లోనే గొంతు కోసి చంపేశాడు. ఆపై ప్రాణ భయంతో తానూ ఇంటికి వెళ్లి ఉ­రిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం సరిహద్దు చేలూరులో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతులిద్దరూ అన్న­మయ్య జి­ల్లా పెద్దతిప్పసముద్రం మండలానికి చెందినవారే.  

వివరాలు ఇలా.. 
మండలంలోని కందుకూరుకు చెందిన మస్తాన్‌ కర్ణాటక రాష్ట్రం చేలూరుకు చెందిన సల్మా (40)ను వివాహం చేసుకుని చేలూరులోని గెరిగిరెడ్డిపాళ్యలో స్థిర పడ్డాడు. ఇదే పంచాయతీలోని నిలువురాతిపల్లికి చెందిన బావాజాన్‌ (42) కర్ణాటక రాష్ట్రం చింతామణిలోని తస్లీమ్‌ను వివాహం చేసుకుని చేలూరులోని రంగుండ్లులో కాపురం పెట్టారు. మూడేళ్ల కిందట బావాజాన్‌ భార్యా, పిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో బావాజాన్‌ గెరిగిరెడ్డిపాళ్యంలో ఉన్న సల్మాతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఇటీవల సల్మాపై అనుమానం పెంచుకున్న బావాజాన్‌ ఎలాగైనా ఆమెను అంతమొందించాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సల్మా ఇంటికి వెళ్లిన బావాజాన్‌ మాయమాటలతో ఆమెను మంచంపైనే అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. విషయం వెలుగులోకి వస్తే తనను బతకనీయరని భావించిన బావాజాన్‌ ప్రాణభయంతో ఇంటికి వెళ్లి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ వార్తతో చేలూరు గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రకాష్, సీఐ ఎం.శ్రీనివాస్‌ ఘటనా స్థలాలకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాగేపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యు­లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)