Breaking News

శ్రీశైల క్షేత్రంలో సినిమా డ్యాన్సులు

Published on Sun, 01/04/2026 - 04:08

శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మికతకు తిలోదకాలిచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా స్థానిక సత్రంలో అభ్యంతరకర సినీ పాటలతో వేడుకలు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతాళగంగ రోడ్డు మార్గంలోని ఒక ప్రైవేట్‌ సత్రంలో వసతి పొందిన యాత్రికులు డిసెంబర్‌ 31 అర్ధరాత్రి ఆంగ్ల సంవత్సరాది వేడుకల్లో భాగంగా పాటలు పాడుతూ, చిందులు వేస్తూ కేక్‌ కటింగ్‌ చేశారు. శ్రీశైలంలో కొన్నేళ్లుగా ఆంగ్ల సంవత్సరాదిని జరుపుకోరాదని దేవస్థానం కూడా ఆంక్షలు విధించింది. 10 ఏళ్ల క్రితం దేవస్థానం ప్రధాన రాజగోపురం ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పాలతో కూడిన ఆర్చ్‌ కటౌట్, ధ్వజస్తంభం వద్ద అలంకరణ చేసేవారు.

అయితే అప్పటి దేవదాయ కమిషనర్‌ అనురాధ పుణ్యక్షేత్రంలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలు నిషిద్ధమని ప్రకటించడంతో నేటి వరకు దేవస్థానంతో పాటు స్థానికులు కూడా నూతన సంవత్సర వేడుకలకు స్వస్తి పలికారు. కానీ దేవదాయ నిబంధనలకు విరుద్ధంగా సత్రంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వ­డం విమర్శలకు తావిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇదిలాఉంటే ఈ సత్రం నిర్మాణ దాతలలో ఒకరు కర్నూలుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు కావడంతోనే పోలీసులు, ఆలయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్టు సమాచారం. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన సత్రం నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జి.మల్లికార్జున డిమాండ్‌ చేశారు.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)