Breaking News

బాబుగారూ.. మట్టి ఖర్చులైనా ఇవ్వండి!

Published on Sun, 11/17/2024 - 05:41

తిరుపతి అర్బన్‌/సాక్షి, పాడేరు (అల్లూరి సీతారా­మరాజు జిల్లా) : అంగన్‌వాడీ ఉద్యోగులు మృతి చెందితే కనీసం మట్టి ఖర్చులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి అంటూ.. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు కనీసం మట్టి ఖర్చులకైనా నిధులు కేటాయించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. శనివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ధర్నా చేశారు. వారికి సీఐటీయూ నేతలు మద్దతు పలికారు. 

సీఐటీయూ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచి్చన హామీలను కూటమి సర్కార్‌ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి జిల్లా అంగన్‌వాడీల సంఘం అధ్యక్షురాలు పద్మలీల అధ్యక్షతన పెద్ద ఎత్తున జరిగిన నిరసన ధర్నాలో అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, శ్రామిక మహిళా జిల్లా కనీ్వనర్‌ లక్ష్మీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచుతామని చంద్రబాబు చెప్పిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. 

అనంతరం కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌కు ఓ వినతిపత్రాన్ని అందించారు. పాడేరులో అంగన్‌వాడీ సంఘం నాయకులు మాట్లాడుతూ.. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి, తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పలుచోట్ల హెచ్చరించారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు