Breaking News

అంగన్‌వాడీ చిన్నారులకు అస్వస్థత

Published on Fri, 11/21/2025 - 04:27

పాములపాడు: నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌–3కు చెందిన ఎనిమిది­మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం నాలుగు, ఐదేళ్ల వయసున్న 12 మందికి ఉదయం కోడిగుడ్డు, సాయంత్రం పాలు ఇచ్చారు. ఇంటికి వెళ్లిన తరువాత ఎనిమిదిమందికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వారిని  తల్లిదండ్రులు ఆత్మకూరు, నందికొట్కూరు ఆస్పత్రులకు తరలించారు. 

పిల్లల్లో చైతన్యకుమార్, అలేఖ్య, సంధ్య, వసుంధర ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలోను, రితిక, నిక్షిత్‌కుమార్, రిషి ప్రైవేట్‌ ఆస్పత్రిలోను, చార్లెస్‌ రాజు నందికొట్కూరు ప్రైవేటు ఆస్పత్రిలోను చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన అధికారులు గురువారం ఉదయం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.  అంగన్‌వాడీ టీచర్‌ అరుణ, సహాయకురాలు మంజుల నుంచి వివరాలు సేకరించారు. 

సెంటరులో మొత్తం 16 మంది చిన్నారులకుగాను బుధవారం 13 మంది హాజరయ్యారు. ఒకరు మధ్యలోనే ఇంటికి వెళ్లగా 12 మందికి ఆహారం అందించినట్లు వారు చెప్పారు. ఈ ఆహారం విషతుల్యం కావడం వల్లే వీరు అస్వస్థతకు గురైనట్లు అధికారులు, వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐసీడీఎస్, వైద్యశాఖ అధికారులు చిన్నారులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. 

పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు అంగన్‌వాడీ కేంద్రంలోని సరుకుల శాంపిళ్లు, విద్యార్థుల రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. అంగన్‌వాడీ చిన్నారులు అస్వస్థతకు గురవడంపై కలెక్టర్‌ రాజకుమారి ఆరాతీసి, అధికారుల్ని అప్రమత్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)