Breaking News

సీఎం జగన్‌ హయాంలో గిరిజన జీవితాల్లో వెలుగులు

Published on Thu, 08/10/2023 - 11:04

సాక్షి, అమరావతి/సాలూరు: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల జీవితాలు అభివృద్ధి పథంలో పయనింపజేసేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. సీఎం జగన్‌ హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువగా గిరిపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నేతలు బీఆర్‌ అంబేడ్కర్, వైఎస్సార్, గిరిజన నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే పాల్గుణ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 18 సెల్‌ టవర్లతో అన్ని గ్రామాలకు కమ్యూనికేషన్‌ వచి్చంద­న్నారు. గిరిజన మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘ­న­త సీఎం జగన్‌ దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మె­ల్యే కుంభా రవిబాబు మాట్లాడుతూ గిరిజనలకు సీఎం జగన్‌ నాణ్యమైన విద్య, ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషును అందిస్తున్నారని కొనియాడారు. అడవుల్లో రోగాలతో వందలాది మంది చనిపోయేవారని ఇప్పుడు సీఎం జగన్‌ వైద్యం అందుబాటులోకి తెచ్చారని, గిరిజనులు కోసం ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీని తెచ్చారని తెలిపారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గిరిజనులను కనీసం మనుషులుగా కూడా చూడలేదన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ నేతలు డాక్టర్‌ వెంకటలక్షి్మ, మేరాజోత్‌ హనుమంత్‌నాయక్, రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి గుండా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.   

గిరిజనులకు అండగా సీఎం జగన్‌ : డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర   
గిరిజనులకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న­దొర చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూ­రు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆయన అధ్యక్షతన, పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వైభవంగా 
నిర్వహించారు.

రాజన్నదొర మాట్లాడుతూ గిరిజనులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాజ్యాంగపరమైన గిరిజన చట్టాలు జగనన్న పాలనలో పరిరక్షింపబడుతున్నాయన్నారు. గత టీడీపీ పాలనలో ఎన్నికలకు ఆరు నెలలు ముందు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.70 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డా.డీవీజీ శంకరరావు, ఎమ్మెల్సీ పి.రఘువర్మ, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభాస్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: రక్తం కారుతున్నా.. ‘అన్నా.. తను జాగ్రత్త’

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)