Breaking News

వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ నిబంధనల్లో మార్పు

Published on Tue, 06/24/2025 - 04:14

సాక్షి, అమరావతి: వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. సొంత మండలం నిబంధన నుంచి వార్డు సచి­వా­లయాల ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. ఉ­ద్యోగులు సొంత వార్డు పరి«ధిలో కాకుండా ఆ పట్టణంలోనే ఇతర వార్డులకు గానీ, ఉమ్మడి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు గానీ బదిలీపై వెళ్లేందుకు అర్హులని తెలియజేసింది. ఈ మే­రకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా అవకాశం ఇవ్వాలి
‘వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత పట్టణంలోని మున్సిపాలిటీల్లోనే బదిలీలకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే, గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సొంత మండలాలకు బదిలీలకు అవకాశం కల్పించకపోవడంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ’ఒకే శాఖకు చెందిన ఉద్యోగులకు రెండు రకాల నిబంధనలు సమంజసం కాదు. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సైతం వారి సొంత మండలాలకు బదిలీలకు అవకాశం కల్పించాలి’ అని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జాని పాషా, ప్రధాన కార్యదర్శి అంకమ్మరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. 

నేడు జిల్లా, మండల కేంద్రాల్లో వినతులు
గ్రామ సచివాలయాల ఉద్యోగులకు కూడా సొంత మండలాల్లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ మంగళవారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఒక ప్రకటనలో తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)