Breaking News

టెలిమెడిసిన్‌ సేవల్లో ఏపీ ఫస్ట్‌ 

Published on Wed, 02/08/2023 - 03:52

సాక్షి, అమరావతి: టెలిమెడిసిన్‌ సేవల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్‌ సెక్రట­రీ విశాల్‌ చౌహాన్‌ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకుని టెలిమెడిసిన్‌ సేవలను మరింత మెరుగైన రీతిలో అందించాలని సూచించారు. దేశంలో టెలిమెడిసిన్‌ విధానాన్ని బలోపేతం చేసే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయ ఆసియా రీజియన్‌ ఆధ్వర్యాన ఢిల్లీలో నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్‌ చౌహాన్‌ మాట్లాడుతూ హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్‌ల ద్వారా టెలిమెడిసిన్‌ సేవలను అమలు చేస్తున్నామని తెలిపారు.

టెలిమెడిసిన్‌ సేవలకు కరోనా కష్టకాలంలో అత్యంత ఆదరణ లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు టెలిమెడిసిన్‌ సేవలను విస్తరించిందని తెలిపారు. రాష్ట్రంలో 27 టెలిమెడిసిన్‌ హబ్‌లను ఏర్పాటు చేశామని, రోజుకు 60వేల టెలి కన్సల్టేషన్లు నమోదవుతున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9.7 కోట్ల టె­లి కన్సల్టేషన్లు నమోదు కాగా, ఇందులో 3.1కోట్లు (32 శాతం) ఏపీలోనే నమోదయ్యాయని తెలిపారు.

ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలను ఎప్పటికప్పు­డు భర్తీ చేసి రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థంగా నడపాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో టెలిమెడిసిన్‌ కోసం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టి అందులో 6,145 మంది డాక్టర్లను రిజిస్టర్‌ చేయడం ద్వారా అప్పట్లో ప్రజలకు విశేష సేవలు అందించామన్నారు. ఈ డాక్టర్‌లు 13,74,698 కాల్స్‌ స్వీకరించి సేవలు అందజేశారన్నారు.      

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు