Breaking News

మద్యం డిపోల్లో ఉద్యోగులపై వేటు

Published on Thu, 10/31/2024 - 03:38

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల ఉసురుతీస్తోంది. ప్రధానంగా ఎక్సైజ్‌ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని 15వేల మంది  సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీలు ద్వారా పారదర్శకంగా నియమితమైన తమను తొలగించవద్దన్న వారి విజ్ఞప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.

తమను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న వారి వినతిని తిరస్కరించింది. తాజాగా రాష్ట్రంలోని మద్యం డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కంప్యూట­ర్‌ ఆపరేటర్లు, స్కానర్లను తొలగించాలని ప్రభు­త్వం ఆదేశించింది. ఒక్కో డిపోలో పది నుంచి 15మంది చొప్పున మొత్తం 400మందికిపైగా ఆపరేటర్లు, స్కానర్లు పదేళ్లుగా విధుల్లో కొనసాగు­తున్నారు. వారిలో 50శాతం మందిని నవంబరు 1 నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎక్సైజ్‌ శాఖ 200మందిపై వేటు వేసింది. ఇక రెండో విడతలో మిగిలిన 200మందిని కూడా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది.  

మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలు
రాష్ట్రంలోని పలు మద్యం డిస్టిలరీల్లో సీఐడీ అధికా­రులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బృందాలుగా ఏర్పడిన అధికా­రు­లు ఈ సోదాల్లో పాల్గొన్నారు. బీరు తయారీ కంపెనీలు, మొలాసిస్‌ యూనిట్లలోనూ తనిఖీలు ని­ర్వహించారు. గతేడాది కాలంలో ఆ కంపెనీల ఉత్పత్తులు, సరఫ­రా రికార్డులను పరిశీ­లించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నా­రు. 

జత్వానీ కేసు విచారణ చేపట్టిన సీఐడీ
హనీట్రాప్‌ కేసుల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. ఆ కేసును ఇప్పటివరకు విజయ­వాడ పోలీసులు దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)