Breaking News

అప్పుల్లో అడుగునే

Published on Tue, 02/06/2024 - 02:16

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా మరోసారి విస్పష్టంగా కీలక ప్రకటన చేసింది. ఏపీ అప్పుల్లో అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం, వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్‌ కాకా పాటిల్, సంతోష్‌ కుమార్, దినేష్‌ చంద్ర యాదవ్‌ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సోమవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.

దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉందని లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అది కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న రీతిలో రాష్ట్రం అప్పులు లేనే లేవని పంకజ్‌ చౌదరి జవాబుతో తేలిపోయింది. 15వ ఆర్థి క సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్‌ అప్పులున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను ఆర్బీఐ అధ్యయనం చేసిన అనంతరం వివిధ రాష్ట్రాల అప్పులను వెల్లడించిందన్నారు. 

పేదలను ఆదుకున్న డీబీటీ.. 
కోవిడ్‌ సమయంలో (2020–21) ప్రస్తుత ధరల ప్రకారం దేశ జీడీపీ వృద్ధితో పాటు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్‌డీపీ వృద్ధి క్షీణించగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2.1 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 17.6 శాతం నికర వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2022–23లో ఏపీలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14 శాతం నికర వృద్ధి నమోదైందన్నారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ 2022–23లో దేశంలో తొమ్మిదో స్థానంలో (రూ.2,19,518) ఉన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా, ఆర్థి క కార్యకలాపాలకు ఊతం ఇచ్చేందుకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నగదు బదిలీని కొనసాగించిన విషయం తెలిసిందే.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)