Breaking News

పెద్దలు పెరిగిపోతున్నారు

Published on Sun, 01/25/2026 - 05:16

సాక్షి, అమరావతి: దేశంలోని సగం రాష్ట్రా­లు వృద్ధాప్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు వృద్ధాప్య రాష్ట్రాల కేటగిరీలోకి వెళ్లిపోయాయి. ఏపీ 2031 నాటికి వృద్ధాప్య కేటగిరీలోకి వెళ్లనుంది. ఫలితంగా పనిచేసే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోనుంది. దేశంలో జనాభా పరివర్తన–రాష్ట్రా­ల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఆర్‌బీఐ నివేదిక విడు­దల చేసింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న జనాభా వాటా 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రాన్ని వృద్ధాప్య రా­ష్ట్రంగా వర్గీకరిస్తారు. 

60 ఏళ్ల వయసు జనాభా 10 శాతం నుంచి 15 శా­తం మధ్య ఉంటే ఇంటర్మీడియెట్‌ రాష్ట్రంగా.. 10 శాతం కంటే తక్కువ ఉంటే యువ రాష్ట్రంగా వర్గీకరిస్తారని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. 2026లో ఏపీలో వృద్ధుల జనాభా 14.1 శాతం ఉండగా.. 2031 నా­టి­కి 16.4 శాతానికి, 2036 నాటికి 18.9 శాతానికి పెరు­గుతుందని అంచనా. 2016లో దేశంలోని అన్ని రాష్ట్రాలు యువ లేదా ఇంటర్మీడియ­ట్‌ కేటగిరీలో ఉండగా.. 2026 నాటికి కేరళ, తమిళనాడు 60 ఏళ్లు పైబ­డిన జనాభాలో 15 శాతం కంటే ఎక్కువ మందితో వృద్ధాప్య వర్గంలోకి ప్రవేశించాయి.

2036 నాటికి వృద్ధాప్యవర్గంలోకి మరిన్ని రాష్ట్రాలు..
2036 నాటికి దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు వృద్ధాప్య వర్గంలోకి వెళ్లిపోతాయని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు ఇంటర్మీడియెట్‌ కేటగిరీలోకి వెళ్లిపోతాయని, ఏ ఒక్క రాష్ట్రం యువత కేటగిరీలో ఉండదని నివేదిక పేర్కొంది. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హర్యానా వంటి రాష్ట్రాలు యువ జనాభాతో నిండి ఉన్నాయని నివేదికలో తెలిపింది. ఈ రాష్ట్రాల్లో పనిచేసే వయసు వారి జనాభా వాటా 2031 నాటికి దాటి పెరుగుతూనే ఉంటుందని పేర్కొంది. 

ఈ గణాంకాల ప్రకారం తెలంగాణ పదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు, కార్మిక సరఫరాకు ప్రధాన వనరుగా కూడా పనిచేస్తాయని వివరించింది. జనాభా వయసు ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, యువత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో, ఎక్కువ మంది ఉద్యోగులు సమర్థవంతంగా పని చేస్తే, ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లను పెంచే పెద్ద పన్ను ఆధారాన్ని సృష్టించవచ్చని తెలిపింది. 

పెరిగిన పట్టణీకరణ వల్ల, వ్యవసాయం వంటి పన్ను విధించని రంగాల నుంచి వైదొలగడం ద్వారా ఈ రాష్ట్రాల్లో పన్ను ఆధారాన్ని మరింత పెంచుతుందని నివేదిక పేర్కొంది. అయితే దీనికి విరుద్ధంగా, వృద్ధాప్య రాష్ట్రాల్లో, క్రమంగా తగ్గిపోతున్న శ్రామిక శక్తి దీర్ఘకాలిక వృద్ధి రేటును తగ్గిస్తుందని, తద్వారా పన్ను ఆధారాన్ని, ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయ పన్నులను పాక్షికంగా క్షీణింపజేస్తుందని వివరించింది. 

యువ రాష్ట్రాలు స్థిరంగా బలమైన ఆదాయ సమీకరణను ప్రదర్శిస్తాయని, ఇది అధిక స్థాయి రెవెన్యూ రశీదులు, పన్ను ఆదాయాలు, కేంద్ర బదిలీలలో ప్రతిబింబిస్తాయని, మధ్యస్థ రాష్ట్రాలు సాపేక్షంగా స్థిరమైన ఆదాయ పనితీరును నిర్వహిస్తాయని తెలిపింది. తద్వారా రెవెన్యూ రశీదులు, పన్ను ఆదాయాలు, కేంద్ర బదిలీలలో మిత ఫలితాలు ఉంటాయని పేర్కొంది. వృద్ధాప్య రాష్ట్రాలు బలహీనమైన పనితీరును ప్రదర్శిస్తాయని, అలాగే కేంద్రం నుంచి తక్కువ బదిలీలు ఉంటాయని పేర్కొంది. 

యువ రాష్ట్రాలు మానవ మూలధన పెట్టుబడులను బలోపేతం చేయడం ద్వారా వారి జనాభా లాభాలను ఉపయోగించుకోవచ్చని, ఇంటర్మీడియెట్‌ రాష్ట్రాలు వృద్ధాప్యానికి ముందస్తు తయారీతో వృద్ధి ప్రాధాన్యతలను సమతుల్యం చేసుకోవచ్చని తెలిపింది. వృద్ధాప్య రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షణ, పెన్షన్, శ్రామికశక్తి విధాన సంస్కరణలతో పాటు ఆదాయ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని ఆర్‌బీఐ నివేదిక సూచించింది.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)