Breaking News

ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా

Published on Mon, 06/05/2023 - 08:41

సాక్షి అమరావతి/భువనేశ్వర్‌/మహారాణిపేట: ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో గాయపడి, బాలాసోర్‌ మెడికల్‌ కాలేజి ఆస్పత్రిలో చికిత్స పొందున్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆది­వారం పరామర్శించారు. అంతకు ముందు ఆయన బాలాసోర్‌ జిల్లా బహనాగా బజార్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో స్థితిగతులను సమీక్షించి, ఘటన పూర్వాపరాలపై అధికారులతో విశ్లేషించారు.

లోటుపాట్లు లేకుండా సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలు కొనసాగేలా వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కూడా చర్చించారు. స్థానికుల సహాయ, సహకారాలను మంత్రి ప్రశంసించారు. బాధి­తు­లను ఆదుకునే దిశగా ఏపీ ప్రభు­త్వం పలు చర్యలు చేపట్టిందని వివరించారు. అత్యవసర సేవ­లకు అనుకూలంగా భువనేశ్వర్‌లో 16 అంబులె­న్స్‌­లు, 10 మహా ప్రస్థానం వాహనాలు, బాలాసో­ర్‌లో 5అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచిందని చెప్పారు.    

భువనేశ్వర్‌లో బాధితుల సహాయ కేంద్రం  
ఆచూకీ తెలియని వారి కోసం భువనేశ్వర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి­నట్టు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్ప­టికప్పుడు ఒడిశా అధికారులతో సంప్రదింపులు చేస్తోందన్నారు. భువనేశ్వర్‌లోని ఆస్పత్రుల్లో 120 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయ­న్నారు. మృతులను గుర్తించడానికి కుటుంబసభ్యులను తీసు­కెళ్లేందుకు వాహ­నాలను ఏర్పా­టు చేసినట్టు చెప్పా­రు. సహా­యం కోసం 1929 హెల్ప్‌లైన్‌తో పాటు ప్రత్యేక అధికారి తిరుమల నాయక్‌(ఐఏఎస్‌) 8895351188ను బాధిత కుటుంబాలు సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల, మృతుల వివరా­లను  https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారన్నారు. కటక్‌ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎస్‌సీబీ మెడికల్‌ కళాశాల, భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్, బారముండా బస్టాండ్, విమా­నాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌లు పని చేస్తున్నాయన్నారు. 

క్షతగాత్రులకు విశాఖలో చికిత్స 
రైలు ప్రమాదంలో గాయపడ్డ పలు­వురికి విశాఖ­లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.జగదీ­శ్వ­రరావు తెలిపారు. సెవెన్‌ హిల్స్, ఐఎన్‌ఎస్‌ కల్యాణి ఆస్పత్రుల్లో ఇద్దరి చొప్పున, కేజీహెచ్‌లో ముగ్గురికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎ.శంకరరావుకు అన్ని పరీ­క్షలు చేశామని, ఆరోగ్యం స్థిరంగా ఉందని సూప­రింటెండెంట్‌ డాక్టర్‌ రాధాకృష్ణ తెలిపారు. బాధితుల కోసం కేజీహెచ్‌ క్యాజువాలిటీ వద్ద 30 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. బుచ్చి­రాజు­పాలెం ప్రాంతానికి చెందిన భారతి, మాధవరావు­లకు ఇక్కడే చికిత్స అందిస్తున్నామన్నారు. కె.పూజ అనే మహిళను భువనేశ్వర్‌ నుంచి విశాఖకు తీసుకొస్తున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.  

గురుమూర్తికి అక్కడే అంత్యక్రియలు
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన సి.గురు­మూర్తి ఒక్కరే మృతి చెందారు. ఆయన కుటుంబం బాలాసోర్‌లో ఉంటున్నందున మృతదేహాన్ని అక్కడికే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా విజయవాడలో దిగాల్సిన ప్రయాణికుల్లో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబసభ్యులకు సమా­చారం అందించేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్‌ నంబర్‌ల­ను అందుబాటులో ఉంచామని రైల్వే అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 18004250101, 833390­5022 (వాట్సాప్‌) సంప్రదించవ్చని తెలిపారు. 

చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. పట్టాలపై ప్రేమ కథ!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)