Breaking News

ఏపీ మైనింగ్‌కు జాతీయ అవార్డు

Published on Wed, 01/24/2024 - 05:19

సాక్షి, అమరావతి: మేజర్‌ మినరల్స్‌ మైనింగ్‌ లీజుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయస్థాయి అవార్డు లభించింది. భోపాల్‌లో మంగళవారం జరిగిన స్టేట్‌ మైనింగ్‌ మినిస్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి చేతులు మీదుగా రాష్ట్ర గనుల శాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌ సమక్షంలో ‘అవార్డ్‌ ఆఫ్‌ అప్రిసియేషన్‌’ను వీజీ వెంకటరెడ్డికి ప్రహ్లాద్‌ జోషి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకువచ్చిన పలు సంస్కరణలను కేంద్ర మంత్రి అభినందించారు. మైనింగ్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అత్యంత పారదర్శకంగా అవలంభిస్తున్న విధానాల వల్ల అనతికాలంలోనే జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలవడం ప్రశంసనీయమని కొనియాడారు. 

మొదటి స్థానం సాధించడమే లక్ష్యం:  వీజీ వెంకటరెడ్డి
అవార్డును అందుకున్న సందర్భంగా గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనింగ్‌ రంగంలో సీఎం వైఎస్‌ జగన్‌ అనేక సంస్కరణలను తీసుకువచ్చారని చెప్పారు. గతంలో ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా లీజు జారీ చేసే విధానం ఉండేదని, దీనివల్ల అనేక ఇబ్బందులు రావడమే కాకుండా ఎక్కువ శాతం మైనింగ్‌ బ్లాక్‌ల్లో ఆపరేషన్స్‌ జరగకుండా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మైనింగ్‌ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆక్షన్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. 2022–23లో 146 మైనర్‌ మినరల్‌ బ్లాక్‌ లకు, 2023–24లో ఇప్పటివరకు 134 మైనర్‌ మినరల్స్‌ బ్లాక్‌లకు ఆక్షన్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)