Breaking News

పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు!

Published on Mon, 06/12/2023 - 07:26

సాక్షి, అమరావతి :  కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ముందే చెప్పినట్లుగా సమర్ధంగా చేపట్టింది. గతంలో మాదిరిగా ఎక్కడా గందరగోళం, గొడవలు లేకుండా, అక్షరాల 50 వేల మంది పైచిలుకు టీచర్ల బది­లీల ప్రక్రియను ప్రారంభించింది. రకరకాల కారణాలతో అయిదారేళ్లుగా ఆగిపోయిన ఈ బదిలీల కౌన్సెలింగ్‌ 15 రోజుల్లో పూర్తిచేసి, కొత్త స్కూళ్లలో కొత్త టీచర్లను బదిలీ చేసింది. గతంలో అర్థరాత్రి వరకు సాగే బదిలీ ప్రక్రియలో ఎంతో గందరగోళం నెలకొనేది.

కానీ, ఈసారి టెక్నాలజీని ఉపయోగించి చేపట్టిన ఈ ప్రక్రియతో ఇంటి నుంచి లేదా ఇంటర్నెట్‌ పాయింట్‌ నుంచి బదిలీ ధ్రువపత్రం తీసుకుని కొత్త స్కూల్లో చేరుతున్నారని, వేలాది టీచర్ల ముఖా­ల్లో కొత్త ఆనందం కనిపిస్తోందని ఉపాధ్యాయ సంఘా లు తెలిపాయి. 45వేల ప్రభుత్వ స్కూళ్లలోని 41 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవుల్లో, ఎక్కడి వారు అక్కడే ఉంటూ, ఎవరి ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేకుండా పకడ్బందీగా నిర్వహించిన చారిత్రాత్మక కౌన్సిలింగ్‌ అని పేర్కొంటూ ప్రభుత్వాన్ని, పాఠశాల విద్యాశాఖకు ఆయా సంఘాలు కితాబిచ్చాయి.  

ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేదు 
సంఘాల మధ్య తరచూ చోటుచేసుకునే ఆధి­పత్య ధోరణుల నేపథ్యంలో..  ‘అర్థరాత్రుళ్లు ఆగిపోయే కౌ న్సెలింగ్‌ లేదు.. ఎక్కడా డీఈఓ కార్యాల­యాల ముందు ఉపాధ్యాయుల పడిగాపులు లేవు.. ఆమ్యామ్యా లు ఇస్తేనే ఆర్డర్లు ఇస్తామనే వేధింపుల్లేవు.. ఇంట్లో ఉండి దరఖాస్తు చేసుకుని, ఇంట్లో నుంచే బదిలీ ఆర్డర్‌ పుచ్చుకుని, కొత్త స్కూళ్లల్లో చేరిన వేలాది ఉపాధ్యాయులందరూ టెక్నాలజీకి మనసులోనే నమస్కరిస్తున్నారు. ఇంత ప్రశాంతంగా జరిగిన దాఖలాలు లేవు. ఈ ఘనత మన పాఠశాల విద్యాశాఖదే. బదిలీల ప్రక్రియను అద్భు­తంగా నిర్వహించిన ప్ర భుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థుల విద్యా ప్రయోజనాలకు కట్టుబడి ఉందన్న సంకేతాన్ని పంపించింది’ అంటూ డెమోక్రటిక్‌ పీఆరీ్టయూ ఏపీ టీచర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి: తమ్ముళ్లు ఏరి?.. 21 లక్షలకు పడిపోయిన టీడీపీ సభ్యత్వం 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)