Breaking News

రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం ఢమాల్‌

Published on Tue, 12/02/2025 - 04:35

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం పడిపోయింది. 2023–24 ఆర్థిక ఏడాది కన్నా 2024–25లో రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. బిహార్, పశ్చిమ బెంగాల్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి 2023–24 ఆరి్థక ఏడాది కన్నా 2024–25లో ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం పెరిగింది.

కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్ర­ం పడిపోయింది. ఈ విషయాన్ని సోమవా­రం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2023–24లో ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి రూ.26,066 కోట్లు రాబడి వస్తే 2024–25లో అది రూ.23,804 కోట్లకు పడిపోయింది. అంటే.. రూ.2,262 కోట్ల రాబడి తగ్గిపోయింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం పడిపోవడంవల్లే పన్ను రూపంలో కేంద్రానికి ఏపీ నుంచి రాబడి తగ్గిపోయిందని స్పష్టమవుతోంది.  

నెలనెలా తగ్గుతున్న అమ్మకం పన్ను రాబడులు.. 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపటి­్టనప్పటి నుంచి రాష్ట్ర అమ్మకం పన్ను రాబడులు అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే ప్రతీనెలా తగ్గుతున్నాయని కాగ్‌ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వల్లే అ­మ్మకం పన్ను రాబడి తగ్గిపోతోంది. ఎన్నికల ముందు ప్రజలిచ్చిన హామీలను చంద్రబాబు అధికార­ంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను అమలుచేయ­కపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)