Breaking News

స్టార్టప్స్‌కు డెస్టినేషన్‌గా ఏపీ

Published on Sun, 02/11/2024 - 04:59

సాక్షి, విశాఖపట్నం: స్టార్టప్స్‌ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతోందని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) అడిషనల్‌ డైరెక్టర్‌(ఏడీ) సురేష్‌ బాత్రా అన్నారు. డీప్‌ టెక్‌ నైపుణ్య ఫౌండేషన్‌ (డీటీఎన్‌ఎఫ్‌) అధ్వర్యంలో విశాఖలోని వీఎంఆర్‌డీఏ చిల్ర్డన్స్‌ ఎరీనాలో శనివారం నిర్వహించిన ఏఐ క్లౌడ్‌ సమ్మిట్‌–2024ను సురేష్‌బాత్ర, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ డా.రవిశంకర్‌ ప్రారంభించారు. సురేష్‌ మాట్లాడుతూ ఏపీలో స్టార్టప్‌లకు ఎకోసిస్టమ్‌ అద్భుతంగా ఉందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుకూల వాతావరణం ఏపీలో ఉండటంతో కొత్త ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు.

ఐటీ, అనుబంధ పరిశ్రమలకు విశాఖ కీలకంగా మారుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న స్టార్టప్స్‌లో మూడోవంతు విశాఖలోనే ఉన్నట్లు తెలిపారు. సీపీ రవిశంకర్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అనేది నేరస్తులను గుర్తించేందుకే కాకుండా నేర నియంత్రణకు, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఏపీ ఇన్నోవేటివ్‌ సొసైటీ సీఈవో అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 44 ఇంక్యుబేషన్‌ సెంటర్లలో స్టార్టప్‌ సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

డీప్‌టెక్‌ నైపుణ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ శ్రీధర్‌ కొసరాజు మాట్లాడుతూ భారత్‌లో ఉన్న ఎంఎన్‌సీ, హైటెక్‌ కంపె­నీలకు చెందిన నిపుణులను ఒకేచోట చేర్చి రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్న సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా డీటీఎన్‌ఎఫ్, ఏపీఐఎస్‌ మధ్య కృత్రిమ మేధకు సంబంధించిన ఎంవోయూ జరిగింది. సదస్సులో ఏఐ, క్లౌడ్‌ కంప్యూ­టింగ్‌ నిపుణులు ఆయా రంగాల్లో ఉన్న అవకాశాల గురించి వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)