Breaking News

నేడు ‘కాపు నేస్తం’ నాలుగో విడత

Published on Sat, 09/16/2023 - 04:57

 సాక్షి, అమరావతి: పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా.. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తూ వరు­సగా నాలుగో ఏడాదీ ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగే కార్యక్రమంలో బటన్‌ నొక్కి లబ్ధి­దారుల ఖాతాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా నగదు జమ చేయనున్నారు.

అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. 

కాపులను దగా చేసిన టీడీపీ సర్కారు
టీడీపీ సర్కారు కాపులను అన్ని రకాలుగా దగా చేసింది. కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేసింది. సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు చొ­ప్పు­న ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు కేటాయి­స్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా వంచించింది.  వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 52 నెలల్లో 77,00,628 మంది కాపు, బలి­జ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు డీబీటీ, నాన్‌–డీబీటీతో రూ.39,247 కోట్ల మేర లబ్ధి చేకూర్చడం గమ­నార్హం. కాపు కార్పొ­రేషన్‌ ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్లు చొ­ప్పున ఐ­దేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని మేని­ఫెస్టోలో పేర్కొనగా అంతకంటే మిన్నగా మేలు చేయడం గమనార్హం. 

నేడు నిడదవోలుకు  సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకుంటారు. అక్కడ సెయింట్‌ ఆంబ్రోస్‌ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వైఎస్సార్‌ కాపునేస్తం ఆర్థిక సాయాన్ని బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.  

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు