Breaking News

రాజధానికి మరో రూ.7,500 కోట్ల అప్పు

Published on Sat, 11/29/2025 - 03:29

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం మరో రూ.7,500 కోట్ల అప్పు చేస్తోంది. నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) నుంచి సీఆర్‌డీఏ తీసుకునే ఈ అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం అసలుకు, వడ్డీకి గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురే­ష్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రుణ సంస్థకు ఈ మొత్తం చెల్లించడంలో సీఆర్‌డీఏ విఫలమైన పక్షంలో ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ మేరకు రుణ ఒప్పందంపై ఆర్థికశాఖ అధికారి సంతకం చేయనున్నారు. సీఆర్‌డీఏ తన సొంత వనరుల నుంచి రుణసేవలకు బాధ్యత వహిస్తుందని అందులో పేర్కొన్నారు. హామీ ఇచ్చిన మొత్తంపై రెండు శాతం గ్యారెంటీ కమీషన్‌ సీఆర్‌డీఏ చెల్లించాలని స్పష్టంచేశారు. దీంతో.. రాజధాని కోసం ఇప్పటివరకు చేసిన అప్పులు రూ.40,000 కోట్లకు చేరాయి. 

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పి...  
రాజధాని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే, అందుకు భిన్నంగా భారీగా అప్పులు తెస్తున్నారు. బడ్జెట్‌ నుంచి నిధులు విడు­దల చేస్తున్నారు. అప్పులు తెస్తూ బడ్జెట్‌ నుంచి నిధులు విడుదల చేస్తున్నప్పుడు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు ఎలాగవుతుందో ముఖ్యమంత్రికే తెలి­యా­లని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.  

ఇప్పటి వరకు రాజధాని కోసం ఏ సంస్థ నుంచి ఎంత అప్పు‡అంటే... (రూ.కోట్లలో..)  
⇒ ప్రపంచ బ్యాంకు, ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు 15,000
⇒ హడ్కో 11,000 ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ 7,500
⇒ జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ  5,000
⇒ ఏపీపీఎఫ్‌సీఎల్‌ 1,500
⇒ మొత్తం 40,000

మంగళవారం మళ్లీ బాబు సర్కారు అప్పు 
రూ.3,000 కోట్ల రుణాన్ని నోటిఫై చేసిన ఆర్‌బీఐ  
సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు మళ్లీ బడ్జెట్‌ పరిధిలో అప్పు చేస్తోంది. రూ.3,000 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్‌బీఐ సమీకరించి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.   

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)