Breaking News

వైఎస్‌ జగన్‌ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు

Published on Mon, 09/09/2024 - 05:15

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు మరోసారి గుర్తింపు లభించింది. సులభతర వాణిజ్య ర్యాంకులు (ఈవోడీబీ)–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజంలో ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్‌ గోయల్‌ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పనితీరు భేష్‌ అని స్పష్టం చేశారు.

కేరళ తర్వాత ఏపీయే టాప్‌
2022 ర్యాంకుల కోసం మొత్తం 25 రంగాల్లో  (ఇందులో పరిశ్రమలకు సంబంధించి 15 రంగాలు, పౌరసేవలకు సంబంధించి 10 రంగాలు) మొత్తం 352 సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది. ఈ సంస్కరణలు అమలు చేసినట్టు 17 రాష్ట్రాలు కేంద్రానికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా.. అందులో కేరళ మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్ర, గుజరాత్, రాజస్థాన్, త్రిపుర ఉన్నాయి. తెలంగాణ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సంస్కరణలు అమలు చేసిన తర్వాత వీటిని వినియోగించుకున్న వారిని ర్యాండమ్‌గా సర్వే చేసి వారు ఇచ్చిన స్పందన ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. 2022 సంవత్సరానికి సంబంధించి ఈవోడీబీ ర్యాంకులను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కూటమి పార్టీలకు చెంపపెట్టు
రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేదంటూ ప్రచారం చేసిన కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలకు ఇది చెంపపెట్టు లాంటిందని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తు­న్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈవోడీబీ ర్యాంకుల్లో వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్థానంలో నిలవడమే కాకుండా.. ఇప్పుడు సంస్కరణల అమలు విషయంలో రెండో స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనమంటున్నారు.

సులభతర వాణిజ్యం కోసం ‘ఏపీ వన్‌’ పేరిట సింగిల్‌ విండో విధానం ఏర్పాటు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్తలను చేయిపట్టుకుని నడిపించారు. దీంతోనే డైకిన్, సెంచురీఫ్లై, ఏటీజీ, దివీస్, అరబిందో వంటి అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. గత ప్రభుత్వ విధానం వల్ల విద్యుత్‌ రంగంలో బ్రాండ్‌ ఏపీ విలువ మరమ్మతు చేయలేని విధంగా దెబ్బతిన్నదని టీడీపీ నిరంతరం ఆరోపించింది. ఇదే నిజమైతే.. అదానీ, గ్రీన్‌కో, అరేసెలార్‌ మిట్టల్‌ వంటి విస్తారమైన పేరున్న కంపెనీలు ఇంధన రంగంలో రూ.7,69,815 కోట్లు ఎలా పెట్టుబడి పెట్టాయంటూ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి  గుడివాడ అమర్‌నాథ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)