Breaking News

ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డులు

Published on Sat, 06/17/2023 - 16:17

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నాలుగు జాతీయ జల అవార్డులను దక్కించుకుంది. దేశంలో జలసంరక్షణ, యాజమాన్య పద్ధతుల ద్వారా తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించడం తదితర విధానాలను ప్రోత్సహించడానికి 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. తాజాగా 11 విభాగాల్లో 41 అవార్డులను ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్‌ నాలుగు అవార్డులను దక్కించుకుంది.

నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఏపీ తృతీయ స్థానంలో నిలవగా.. ఉత్తమ స్కూల్‌ విభాగంలో నంద్యాల జిల్లాలోని చాగలమర్రి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ) ద్వితీయ స్థానం, పరిశ్రమల విభాగంలో తిరుపతిలోని కాంటినెంటల్‌ కాఫీ లిమిటెడ్‌ తృతీయ స్థానం దక్కించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థల విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన యాక్షన్‌ ఫ్రెటెర్నాకు ప్రత్యేక ప్రోత్సాహక అవార్డు లభించింది.

శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ జాతీయ జల అవార్డును అందుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నుంచి చాగలమర్రి కేజీబీవీ ప్రిన్సిపాల్, సీసీఎల్‌ ప్రతినిధులు, యాక్షన్‌ ఫ్రెటెర్నా డైరెక్టర్‌ మల్లారెడ్డి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. నీటిని సంరక్షించుకోవడం ద్వారానే భవిష్యత్‌ తరాలను కాపాడుకోగలమన్నారు. జల సంరక్షణను రోజువారీ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నారు.  

ఇదీ చదవండి:గ్రీన్‌ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్‌ మున్ముందుకే


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)