Breaking News

వాన.. వాన.. లేదప్పా?

Published on Tue, 07/15/2025 - 06:04

సాక్షి, అమరావతి: ఆకాశమంతా మబ్బులు.. నేలంతా చిత్తడి.. రోజంతా ముసురు.. కాదంటే జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. అసలు ఇది వానాకాలమా..? లేక ఎండాకాలమా? అనే అనుమానం వస్తోంది. రాష్ట్రంలోకి ఎప్పుడో వచి్చన రుతు పవనాలు ఎటుపోయాయి అనే సందేహం కలుగుతోంది. ఆ స్థాయిలో ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. విస్తృతంగా వర్షాలు కురవాల్సిన సమయంలో ఉక్కపోతతో అల్లాడుతున్నారు.  సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నెల్లూరు జిల్లా కావలి, పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఎండ 40 డిగ్రీలు దాటింది. పల్నాడు జిల్లా జంగ మహేశ్వరపురంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నర్సాపురంలో 39.4, కావలి: 39.1, నెల్లూరు: 39, విజయవాడ: 38.5, తిరుపతిలో 36 డిగ్రీలుంది. ఇంకా అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు న­మోదవడంతో ప్రజలు బయట తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు కూడా ఉక్కపో­త ఉంటోందని వాపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు 28 కంటే ఎక్కువగా ఉంటున్నాయి.. ఇది సాధారణం కంటే 2, 3 డిగ్రీలు ఎక్కువ కావడం గమనార్హం.

ఈ సీజన్‌లో తక్కువ వర్షపాతం 
నిజానికి ఈ సంవత్సరం వర్షాకాలం ముందుగానే ప్రారంభమైంది. వేసవిలోనే వానలు కురిశాయి. కానీ, ఇప్పుడు వర్షాలే లేవు. జూన్‌ నెలలో సగటున 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 7.0 సెం.మీ. మాత్రమే పడింది. ఈ నెలలో ఇప్పటిదాక 30 శాతం లోటు వర్షపాతం ఉంది. దీంతో వాతావరణం వేడెక్కి ప్రజలు ఇబ్బందులు పడడంతో పాటు వ్యవసాయ పరిస్థితులు నిరాశజనకంగా మారాయి. వర్షాలు లేక అనేక ప్రాంతాల్లో రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే వేసిన పంటలు నీరు లేక ఎండిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. 

⇒  నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించినా వాటి కదలికలు బలహీనంగా  ఉండ డం, తేమ గాలులు లేకపోవడంతో ఎండ తీవ్రత పెరిగినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నైరుతి గాలులు బలంగా లేకపోవడం, బంగాళాఖాతంలో ఆవర్తనాలు, అల్పపీడనం ఏర్పడకపోవడంతో వాటికి అనుకూల పరిస్థితి లేకుండాపోయింది. ఈ నెల మూడో వారం నుంచి కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 17వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని చెబుతోంది. తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో నైరుతి రుతుపవనాలు బలపడి వర్షాలు కురుస్తాయని భావిస్తోంది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)