Breaking News

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతం: బండి శ్రీనివాస్‌

Published on Sun, 06/25/2023 - 19:37

సాక్షి, అమరావతి: ఏపీఎన్జీవో భవనంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాల నేతలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని.. ఎలాంటి అవినీతి లేకుండా లక్షా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం సరైనదేనని కరోనా సమయంలో నిరూపితమైందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రపంచంలోనే ఏపీకి ప్రత్యేకత వచ్చిందని.. ఉద్యోగ వ్యవస్థకు ఇదొక గర్వకారణమని కొనియాడారు. సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులను రెగ్యులర్ చేయరని కొందరు అనుమానం వ్యక్తం చేశారని, కానీ సీఎం జగన్ సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి చూపించారని అన్నారు.

చదవండి: ‘కన్నా పోటీచేస్తాడో.. పారిపోతాడో తెలియదు’

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)