Breaking News

నాకు కాస్త టైమ్‌ ఇవ్వండి: మత్స్యకారులకు కలెక్టర్‌ విజ్ఞప్తి

Published on Sun, 10/12/2025 - 19:32

అనకాపల్లి:  బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ధర్నా చేపట్టిన మత్స్యకారులతో కలెక్టర్‌ సంప్రదింపులు జరిపారు. తనకు కాస్త టైమ్‌ ఇవ్వాలని మత్స్యకారులను కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌ కోరారు. బుధవారం వరకూ తనకు సమయం ఇవ్వాలన్నారు కలెక్టర్‌. 

కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా హైవేపై ధర్నాను విరమించారు మత్స్యకారులు. బుధవారం తర్వాత  సమస్యకు పరిష్కారం రాకపోతే మరొకసారి ఆందోళన బాట పడతామని మత్స్యకారులు హెచ్చరించారు. 

అనాకపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పటికే 25 రోజులు కొనసాగుతోంది.

మత్స్యకారుల ఆందోళనకు ప్రధాన కారణాలు:
పర్యావరణ హానికి భయం: ఇప్పటికే ఉన్న మందుల పరిశ్రమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటైతే, సముద్ర జీవనానికి హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రసాయన పరిశ్రమల వల్ల చేపల ఉత్పత్తి తగ్గిపోతుందని, తమ జీవనాధారం ప్రమాదంలో పడుతుందని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.

 తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే రాజకీయ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే నిరాహార దీక్ష కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)