Breaking News

అంబేడ్కర్‌ ఆశయాలను ఏపీలో నిజం చేస్తున్నారు

Published on Mon, 07/03/2023 - 03:25

కంచిలి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రవేశపెట్టి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను నిజం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామంలో నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అభినందించారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలైన రోడ్లు, రైల్వేలు, విమాన సర్విసులు, ఎల్‌ఐసీ, బ్యాంకింగ్‌ తదితర సెక్టార్లను ప్రైవేటీకరణ చేయ­డం దుర్మార్గమని దుయ్యబట్టారు.

చివరికి ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఉపక్రమించడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజాకవి, సినీ గేయ రచయిత జయరాజు, విశ్రాంత ఐఏఎస్‌ పి.ఎస్‌.ఎన్‌. మూర్తి పాల్గొన్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)