Breaking News

కిలో మీటర్‌కు రూ.64.01 కోట్లు

Published on Sat, 04/12/2025 - 04:19

సాక్షి, అమరావతి: రాజధానిలో నిర్మాణ పనుల అంచనా వ్యయాలను  ఏడీసీఎల్‌ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) అడ్డగోలుగా పెంచేస్తోంది. ప్రధానంగా రహదారుల విషయంలో తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఎన్‌–12 రహదారిలో మిగిలిన పనుల పూర్తికి కిలో మీటరుకు సగటున రూ.53.88 కోట్లుగా నిర్ణయించి కాంట్రాక్టర్లకు అప్పగించిన ఏడీసీఎల్‌.. తాజాగా ఈ–13 రహదారిని ఎన్‌హెచ్‌–16 (కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి) వరకు పొడిగించే పనులకు కి.మీ.కు సగటున రూ.64.01 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది. ఈ నెల 7న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

» ఈ–13 రహదారిని నిర్మిస్తున్న పద్ధతిలోనే ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) దేశంలో ఇతర ఆరు లేన్ల రహదారులను అన్ని పన్నులతో కలిపి కి.మీ.కు సగటున రూ.20 కోట్లతో నిరి్మస్తోందని, కానీ, రాష్ట్రంలో మాత్రం ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్‌ కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేందుకే అంచనా వ్యయాలను ఏడీసీఎల్‌ అధికారులు అమాంతంగా పెంచేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. 

» ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పు­తో చేపట్టిన పనుల్లో భారీ దోపిడీకి తెర తీశారంటూ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

»  రాజధానిని ఎన్‌హెచ్‌–16తో అనుసంధానం చేసేలా ఈ–13 రహదారిని 7.29 కిలోమీటర్ల పొడవునా ఒక్కో వరుస ఆరు లేన్‌లతో విస్తరించే పనులను ఏడీసీఎల్‌ చేపట్టింది.  

»   ఆరు లేన్‌లు.. ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు (ఒక్క ఈ–3 రహదారి మాత్రమే ఒక్కో వైపు 60 మీటర్లు వెడల్పు)తో రహదారిని నిర్మించడం, వరద నీటి మళ్లింపు పనులు, వీధి దీపాలు, ఫుట్‌పాత్, స్ట్రీట్‌ ఫర్నిచర్‌తో ఈ–13 రహదారిని పొడిగించే పనులకు రూ.384.78 కోట్లతో ఏడీసీఎల్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

»   న్యాక్, జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.81.92 కోట్లను రీయింబర్స్‌ చేస్తామని టెండర్‌ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. ఈ లెక్కన 7.29 కి.మీ.ల పొడవున నిర్మిoచే రహ­దారి కాంట్రాక్టు విలువ రూ.466.7 కోట్లు అవుతుంది. అంటే.. అప్పుడు కిమీకు రూ.64.01 కోట్లు వ్యయం చేస్తుందన్నది స్పష్టమవుతోంది.  

»   సిండికేట్‌ కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి.. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ముట్టజెప్పిన దగ్గరనుంచి చేసిన పనులకు బిల్లులు చెల్లించేదాక నీకింత నాకింత అంటూ పంచుకోవడానికి ముఖ్య నేత ప్రణాళిక రచించారని, అందుకే ఏడీసీఎల్‌ భారీఎత్తున అంచనాలను పెంచేస్తోందనే అభిప్రాయం నిపుణుల్లో బలంగా వ్యక్తమవుతోంది.  

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)