Breaking News

హోటల్స్‌ను అర్ధరాత్రి వరకు అనుమతించండి

Published on Sat, 11/09/2024 - 05:18

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచేందుకు సహకరించాలని కోరుతూ ఏపీ హోటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బృందం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి వినతిపత్రం అందజేసింది. ఏపీ హోటల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.వి.స్వామి, కార్యదర్శి ఎం.నాగరాజు, కోశాధికారి ఇ.వి.పూర్ణచంద్, విజయవాడ హోటల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రమణ, కార్యదర్శి రాఘవ డీజీపీ ప్రధాన కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. 2018 అక్టోబరు 15వ తేదీన విడుదల చేసిన జీవో 25 ప్రతిని డీజీపీకి అందజేశారు.

దీనికి కొనసాగింపుగా 2022 జూన్‌ 13వ తేదీన ఇచ్చిన మెమో ఉత్తర్వుల కాపీని కూడా జోడించారు. పొరుగున ఉన్న తెలంగాణలో అర్ధరాత్రి  వరకు హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని వివరించారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని హోటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)