Breaking News

పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుల కేటాయింపు

Published on Sat, 02/08/2025 - 05:16

సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకుగాను పలు ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం  అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు  ఆయా సంస్థలకు ప్రాజెక్టులను కేటాయిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ ప్రాజెక్టులకు 30 ఏళ్ల పాటు ప్రభుత్వం భూమిని సమకూరుస్తుందని, ఎకరాకు రూ.31 వేలు చొప్పున ఏటా లీజు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వీటిలో పలు ప్రాజెక్టులను ముందుగా అనుకున్న సంస్థలను పక్కనపెట్టి కొత్త సంస్థల బదిలీ చేయడం గమనార్హం. 

ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా నుంచి బదిలీలు
ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ఆంపిన్‌ ఎనర్జీ పవర్‌ ట్రాన్సిషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గ్రూప్‌ ఆఫ్‌ సంస్థలకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 349.50 మెగావాట్ల పవన, సౌర విద్యుత్‌ పాజెక్టులు బదిలీ. 
» ఇదే సంస్థ నుంచి ఎన్‌ఎస్‌ఎల్‌ రెన్యూవబుల్‌ సీపీపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు శ్రీ సత్యసాయి జిల్లా, కనగానపల్లె మండలం, మద్దెలచెర్వు గ్రామం వద్ద 50 మెగావాట్ల పవన, సౌర హైబ్రీడ్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ బదిలీ. » అనంతపురంలోని రాళ్ల అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో సంస్థకు కేటాయించిన  201.30 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌  ఓ2 పవర్‌ గ్రూప్‌ కంపెనీలకు బదిలీ. 
»  కర్నూలు జిల్లా ఆస్పరి సమీపంలో 498.30 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌..  అయన రెన్యూవబుల్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బదిలీ.

ఎవరికి... ఏవి..? 
» మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌: అన్నమయ్య జిల్లాలో 2000 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్‌.
» టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ: అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గంగవరం సమీప గ్రామాల వద్ద  400 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌.
»నవయుగ ఇంజనీరింగ్‌: అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలిలో 1500 మెగావాట్లు, చిట్టంవలసలో 800 మెగావాట్లు చొప్పున మొత్తం 2300 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్ట్‌లు.
» కడప రెన్యూవబుల్స్‌:  శ్రీ సత్యసాయి జిల్లాలో­ని ఎలకుంట్ల, ముతవకుంట్ల, రామగిరి, నసన­కో­ట గ్రామాలు, కనగానపల్లె, రామగిరి మండలాల్లో 231 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టు.
» అనంతపురం రెన్యూవబుల్స్‌: అనంతపురం జిల్లాలోని అడివిగొల్లపల్లె, బచ్చుపల్లె, యాటకల్, గరుడాపురం, పిల్లలపల్లె, కళ్యాణదుర్గ్, తీటకల్, హులికల్, చాపిరి, ముదిగల్, తూర్పు కోడిపల్లె, పాలవోయ్, నరసాపురం, కళ్యాణదుర్గం, బ్రహ్మాదురంలో 178.20 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌.
» ఆస్పరి రెన్యూవబుల్స్‌: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కంబదూరు, రామగిరి మండలాల్లోని మోటార్చింతలపల్లె, కూరాకులపల్లె, పేరూరు, కొండాపురం, మక్కినవారిపల్లె గ్రామాల్లో 118.80 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టు.
» సాయెల్‌ సోలార్‌:  వైఎస్‌ఆర్‌ జిల్లా పెద్దముడియం మండలం గోవిందపల్లె దిగువ, కల్వతల, కొండసుంకేసుల, నాగిరెడ్డిపల్లే, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలాల్లోని మాయలూరు గ్రామాల్లో 300 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌.
»  సాయెల్‌ సోలార్‌: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడయపల్లి గ్రామం, వైఎస్‌ఆర్‌ జిల్లా కొండాపురం మండలం కోడూరు, సంకేపల్లి, యర్రగుడి గ్రామాల వద్ద 300 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)