Breaking News

‘ఈవీ’ విప్లవానికి ఏపీ తోడ్పాటు భేష్‌

Published on Sun, 10/29/2023 - 05:19

సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్‌ వాహనాల విప్లవాన్ని సాధించే జాతీయ లక్ష్యా­నికి ఆంధ్రప్రదేశ్‌ అందిస్తున్న తోడ్పాటు బాగుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమి­టెడ్‌­(సీఈఎస్‌ఎల్‌) సీఈవో విశాల్‌ కపూర్‌ ప్రశంసలు కురిపించారు. విద్యుత్‌ వాహ­నాల(ఈవీ)పై ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌­(ఈఈఎస్‌ఎల్‌), సీఈ­ఎస్‌­ఎల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో ఆయన వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను ఈఈఎస్‌ఎల్‌ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్ర­శేఖరరెడ్డి శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు.

ఈ ఏడాది ద్వి­చక్ర, త్రిచక్ర విద్యుత్‌ వాహ­æనాల అమ్మకాల్లో 80 శాతం వృద్ధి కనిపిస్తోందని, 2030 నాటికి మొత్తం వాహనాల్లో 30 శాతం ఈవీలే ఉండాలనేది కేంద్రం లక్ష్యమని విశాల్‌ కపూర్‌ అన్నారు. తద్వారా రానున్న ఏడేళ్లలో 846 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారా­లను, 474 మిలియన్‌ టన్నుల చమురు దిగుమతులను తగ్గించవచ్చని వివరించారు. ఇందులో భాగంగా ఈఈఎస్‌ఎల్‌ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ–బస్సుల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పా­రు. సాధారణ బస్సులతో పోల్చితే ఈ–బస్సులు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలందిస్తాయ­న్నారు.

విద్యుత్‌ వాహనాల విప్లవానికి ఏపీ నాంది పలికిందని విశాల్‌ కపూర్‌ ప్రశంసించారు. విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తూ ఉద్యోగు­లకు లక్ష ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావ­డం అభి­నందనీయమన్నారు.

ఏపీలో ప్రస్తుతం 65 వేల విద్యుత్‌ వాహనా­లుండగా, 2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ వాహనాల్లో సగం ఈవీలే ఉండా­లని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకో­వాలని సూచించారు. ఇంధన శాఖ అధికారులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 400 ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 266 స్టేషన్లు పనిచేస్తున్నాయని, మరో 115 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)