Breaking News

గణతంత్ర ‘వెలుగులు’

Published on Thu, 01/26/2023 - 03:55

సాక్షి, అమరావతి: 74వ గణతంత్ర దిన వేడుకలకు ఏపీ సచివాలయం, శాసన సభ, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. శాసన సభ భవనంతో పాటు రాష్ట్ర సచివాల­యంలోని ఐదు బ్లాక్‌లను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. మరోవైపు గణతంత్ర వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయం విద్యుత్‌ కాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది. ప్రజలను ఈ దృశ్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.  సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. కాగా, స్టేడియంలో ఏర్పాట్లను గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా బుధవారం పరిశీలించారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చే హైటీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.  

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)