కాఫర్‌ డ్యాంల సీపేజీపై అప్రమత్తం

Published on Sat, 08/30/2025 - 03:56

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలలో సీపేజీ (ఊట నీరు) సమస్యపై ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదేశించింది. వచ్చే సీజన్‌ నాటికి సీపేజీ సమస్య పరిష్కారం కావాలని సూచించింది.  సియాన్‌ హించ్‌బెర్గర్, మెస్సర్స్‌ సీ రిచర్డ్‌ డొన్నెళ్లి, గియానోఫ్రాంకో డీ క్యాప్పో, డేవిడ్‌ పాల్‌లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జల్‌శక్తి డిప్యూటీ కమిషనర్‌ గౌరవ్‌ సింఘాల్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ భక్షి, డైరెక్టర్‌(డిజైన్స్‌) రాకేష్, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాంలతో కలిసి శుక్రవారం  పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. 

జలవనరుల శాఖ ఇంజినీర్‌–ఇన్‌–చీఫ్‌ నరసింహమూర్తి ప్రాజెక్టు పనులను పూర్తి వివరాలతో నిపుణుల కమిటీకి వివరించారు. అనంతరం, ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్ల (మేఘా, బావర్‌ ప్రతినిధులు)తో కలిసి కమిటీ సమావేశం జరిగింది. ప్రధాన డ్యాం గ్యాప్‌–1 నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లతో మోడల్‌ డ్యాం నిర్మించాలన్న గత సూచన అమలు చేయకపోవడాన్ని కమిటీ ఆక్షేపించింది. వర్షాల వల్ల నిరి్మంచలేకపోయామని అధికారులు వివరించారు.   

ప్రధాన సూచనలు: 
»  ప్రధాన డ్యాం గ్యాప్‌–1, గ్యాప్‌–2ల మధ్య జీ–హిల్‌ను క్షేత్ర స్థాయి పరిస్థితుల ఆధారంగా తగ్గించాలని సూచన. 
» గ్యాప్‌–1 ప్రాంతంలో వరదల వల్ల ఏర్ప డిన అగాధాలను 25 మీటర్ల వరకు రాళ్లతో నింపి, ప్రాథమిక పనులు ప్రారంభించాలి.  

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)