Breaking News

పట్టాతో పాటు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

Published on Thu, 08/24/2023 - 03:28

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థులకు పట్టాతో పాటు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. కాకినాడలోని జేఎన్‌టీయూకే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్‌ ద్వారా 24 వేల మందికి ఇంటర్న్‌షిప్‌ నిర్వహించి సర్టిఫికెట్లు అందించినట్టు తెలిపారు. ఉన్నత విద్యలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, వర్సిటీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటుచేసి నైపుణ్యాలు పెంచుతున్నట్టు తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఉన్నత విద్యలో పరీక్ష విధానం, మెథడాలజీ, బోధన పద్ధతులు, పాఠ్య ప్రణాళికలో తేవాల్సిన మార్పులపై దృష్టి సారించామన్నారు. ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న మార్పులను కరిక్యులమ్‌లో భాగం చేయాలని హేమచంద్రారెడ్డి సూచించారు. అనంతరం వర్సిటీ వ్యవస్థాపక లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, మాజీ వీసీ రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)