Breaking News

ఎడెక్స్‌తో ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు వరం

Published on Sun, 03/03/2024 - 03:11

ఏయూక్యాంపస్‌: ప్రతిష్టాత్మకమైన ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రాష్ట్ర యువతకు వరంగా నిలుస్తుందని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఎడెక్స్‌ కోర్సులు అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తంచేస్తూ ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు ‘థాంక్యూ సీఎం సార్‌..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ యువత పోటీపడాలని, ఇందుకనుగుణంగా విద్య ప్రమాణాలు, సామర్థ్యాలను పెంపొందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వాటిని యువత సద్వినియోగం చేసుకుంటూ నూతన అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

విద్యా విభాగాధిపతి ఆచా­ర్య టి.షారోన్‌రాజు మాట్లాడుతూ మన విద్యార్థులు ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్‌ వంటి ప్రపంచ ప్ర­ఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి నేరుగా కో­ర్సులు చదివి సర్టిఫికేషన్‌ పొందే అవకాశం నేడు లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు సైతం అంతర్జాతీయ వి­శ్వ­విద్యాలయాల్లో కోర్సులు పూర్తిచేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజి్రస్టార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎ.నరసింహారావు, విద్య విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)