నేడు నింగిలోకి అగ్నిబాన్‌ రాకెట్‌

Published on Sat, 04/06/2024 - 02:45

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అగ్నికుల్‌ కాస్మోస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (చెన్నై) అనే ప్రయివేట్‌ అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్‌ ఎస్‌ఓఆర్‌ టీఈడీ మిషన్‌–01 అనే చిన్న తరహా రాకెట్‌ను సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని అగ్నికుల్‌ ప్రయోగవేదిక నుంచి శనివారం ఉదయం 6గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని షార్‌ శుక్రవారం మీడియాకు తెలిపింది. ఇస్రోలోని వాణిజ్యవిభాగమైన ఇన్‌స్పేస్‌ సంస్థ ఆహ్వానం మేరకు షార్‌లోని సౌండింగ్‌ రాకెట్‌ లాంచ్‌పాడ్‌ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగంలో సుమారు వంద కిలోలు బరువు కలిగిన పేలోడ్‌ (ఉపగ్రహం)­ను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ (లియో)లోకి పంపించనున్నారు. అయితే రాకెట్‌కు సంబంధించిన అన్ని విషయాలను అగ్నికుల్‌ సంస్థ చూసుకుంటుండగా, షార్‌ అధికారులు, ఇంజినీర్లు ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈ రాకెట్‌కు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించడం లేదు.

అయితే షార్‌ వేదికగా ప్రయివేట్‌ అంతరిక్ష సంస్థల్లో స్కైరూట్, అగ్నికుల్‌ అనే రెండు సంస్థలకు చెందిన చిన్న తరహా ప్రయోగాలకు ఇస్రో వీలు కల్పిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రయోగ వేదికలను కూడా కల్పించి మరీ ప్రయివేట్‌ అంతరిక్ష సంస్థలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అందుకే అగ్నికుల్‌ సంస్థకు షార్‌కేంద్రంలో ఒక ప్రయోగవేదికను కూడా కేటాయించారు.  

అగ్నిబాన్‌ రాకెట్‌ వివరాలివి 
పేటెంట్‌ పొందిన అగ్నిలెట్‌ ఇంజన్‌లతో ఈ రాకెట్‌ నడవడం విశేషం. ఇది త్రీడీ–ప్రింటెడ్‌ 6 కేఎన్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ సాయంతో నిలువునా నింగిలోకి ఎగురుతుంది. అగ్నికుల్‌ రాకెట్‌ 18 మీటర్లు ఎత్తు కలిగి 1.3 మీటర్లు వెడల్పు ఉంది. ప్రయోగ సమయంలో 14వేల కిలోల బరువు కలి­గి ఉంటుంది.

ఈ అగ్నిలెట్‌ ఇంజిన్లలో ద్రవ ఆక్సిజన్, ద్రవ ఆక్సిడైజర్‌ అనే ఇంధనం సాయంతో మూడు దశలుగా రాకెట్‌­ను ప్రయోగిస్తారు. అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ గతే­డాది ఆగస్టు 15న ఒకసారి ప్రయోగాన్ని నిర్వహించగా,  రెండోసారి శనివా­రం ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

Videos

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

Photos

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)