Breaking News

అగ్నిబాన్‌ రాకెట్‌ ప్రయోగం మరోసారి వాయిదా

Published on Wed, 05/29/2024 - 06:16

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా):  ప్రైవేటు అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్‌ రాకెట్‌ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సాంకేతిక లోపాల కారణంగా ఈ రాకెట్‌ ప్రయోగం గతంలో రెండుసార్లు వాయిదా పడింది. అందులో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిదిద్ది మంగళవారం తెల్లవారు జామున ప్రయోగానికి సిద్ధం చేశారు. అయితే, ప్రయోగానికి కొద్ది సెకన్ల ముందు మరోసారి సాంకేతిక లోపాన్ని గుర్తించి, ప్రయోగాన్ని నిలిపివేశారు. అగ్నికుల్‌ కాస్మోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (చెన్నై) అనే ప్రైవేటు ఎస్‌ఓఆర్‌ టీఈడీ మిషన్‌–01 అనే ఈ చిన్న తరహా రాకెట్‌ను రూపొందించింది.

సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని ధనుష్‌ రాకెట్‌ కాంప్లెక్స్‌ నుంచి ఈ ఏడాది మార్చి 22న తొలిసారి దీనిని ప్రయోగానికి సిద్ధం చేశారు. చివర్లో సాంకేతిక లోపంతో వాయిదా వేశారు. మళ్లీ ఏప్రిల్‌ నెల 6న మరోసారి ప్రయోగానికి సిద్ధమైనప్పటికీ, సాంకేతికపరమైన కారణాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా పడింది. వీటిన్నింటినీ అ«ధిగమించి మంగళవారం తెల్లవారు­జామున 5.45 గంటలకు మరోసారి ప్రయోగానికి పూనుకొన్నారు. 6 గంటల ముందు నుంచి (సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి) కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ఆఖర్లో 11 సెకన్లకు ముందు కమాండ్‌ కంట్రోల్‌ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు.తదుపరి ప్రయోగ తేదీని నిర్దిష్టంగా ప్రకటించలేదు.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు