Breaking News

వేంపాడు టోల్‌ప్లాజా వద్ద అఘోరీ హల్‌చల్‌

Published on Tue, 11/05/2024 - 05:36

నక్కపల్లి: ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతు­న్న  అఘోరీ సోమవారం అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కొద్ది­సేపు హల్‌చల్‌ చేశారు. రాజమండ్రి నుంచి విశాఖవైపు వెళ్తున్న అఘోరీ తన కారులో వేంపాడు టోల్‌ప్లాజా వద్దకు వచ్చారు. టోల్‌ ఫీజు చెల్లించాలని సిబ్బంది కోరడంతో తన వద్ద ఫీజు తీసుకోడానికి వీల్లేదని, తాను చెల్లించనంటూ వాగ్వాదానికి దిగారు. ఘర్షణ ఎందుకని ఫీజు తీసుకో­కుండానే సిబ్బంది ఆమె కారును విడిచిపెట్టారు . 

టోల్‌ప్లాజా దాటి కొద్దిదూరం వెళ్లిన అఘోరీ తిరిగి టోల్‌ప్లాజా వద్దకు వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కార్యాలయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. టోల్‌ సిబ్బంది తనపై అనుచితంగా ప్రవర్తించారని, తన ప్రైవేట్‌ భాగాలను ముట్టుకున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ ప్రభుత్వంలో తనలాంటి నాగసాధు మహిళా అఘోరీకే రక్షణ లేకపోతే.. సాధారణ మహిళ­లకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. 

శరీరాన్ని తాకి సారీ చెబుతున్నారని, వీళ్లు అత్యాచారాలు, హత్య­లు చేసి కూడా సారీ చెబుతారని ఆక్షేపించారు. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్య­లు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, అప్పటి వరకు కదిలేది లేదని భీష్మించారు. ఇంతలో నక్కపల్లి, పాయ­క­రావుపేట పోలీసులు వచ్చి అఘోరీతో మాట్లాడారు. సీసీ టీవీ ఫుటేజీలు కావాలని ఆమె డిమాండ్‌ చేయడంతో పోలీసులు టోల్‌ప్లాజా వద్ద అఘోరీకు సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ఫుటేజీల్లో కొన్నింటిని చూపించారు. 

ఇటీవల తెలంగాణ ప్రాంతంలో వార్తల్లోకెక్కిన ఈ అఘోరీని చూసేందుకు టోల్‌గేట్‌ పరిసర ప్రాంతాల వారు, జాతీయరహ­దారిపై రాకపోకలు సాగించేవారు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపేశారు. అఘోరీ అక్కడ ఉన్నంత సేపు వారు కూడా కదలకపోవడం గమనార్హం.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)