Breaking News

మా గోడు వినండి!

Published on Mon, 07/15/2024 - 04:40

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల వెతలు మళ్లీ మొదలయ్యాయి. చట్టంలోని నిబంధనలను అమలు చేసి ఉద్యోగులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చట్ట ప్రకారం ఇచి్చన జీవోలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేసే మహాయజ్ఞాన్ని తలపెట్టింది. 

ఈ క్రమంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిపై వర్క్‌షాప్‌ అటెండర్లుగా విధులు నిర్వహిస్తున్న 22 మందిని రెగ్యులర్‌ చేస్తూ.. ఈ ఏడాది మార్చి 16న జీవో నంబర్‌–8 జారీ చేసింది. అనంతరం ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో జీవో అమలు తాత్కాలింగా నిలిచిపోయింది. కొత్తగా అధికారంలోకి వచి్చన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల శ్రేయస్సును విస్మరించి న్యాయంగా వారికి దక్కాల్సిన హక్కులను దూరం చేస్తోంది. 

50 ఏళ్లు పైబడిన వారే ఎక్కువ 
ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగుల చట్టంలోని నిబంధనల ప్రకారం వర్క్‌షాప్‌ అటెండర్లుగా పని చేస్తున్న వారిని గత ప్రభుత్వం రెగ్యులర్‌ చేసింది. వీరు ఐటీఐ, డిప్లొమా విద్యార్హతతో దాదాపు 15 ఏళ్లుగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పని చేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల వయసులో ప్రభుత్వం తమ సేవలను గుర్తించి క్రమబదీ్ధకరించడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. పదవీ వివరణ 62 ఏళ్లు ఉండటంతో.. మిగిలిన పుష్కర కాలం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసే అవకాశం దక్కిందనే ఆనందం కాస్తా రెండు నెలల్లోనే ఆందోళనగా మారింది. 

గత ప్రభుత్వం రెగ్యులర్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా సాంకేతిక విద్యాశాఖ మాత్రం వాటిని అమలు చేస్తూ పోస్టింగ్‌ ఆర్డర్లు ఇవ్వకుండా జాప్యం చేయడం కలవరపెడుతోంది. వాస్తవానికి 22 మంది రెగ్యులర్‌ ఉద్యోగుల పరిధిలోకి వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో గడచిన మూడు నెలలుగా కాంట్రాక్టులోనే కొనసాగుతున్నారు. అయితే.. సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీని మాత్రం బ్లాక్‌ చేశారు. ఫలితంగా జూన్‌ నెలలో రావాల్సిన జీతాలు సైతం పెండింగ్‌లో పడ్డాయి. జీతాలపై ఆధారపడటంతో కుటుంబాల పోషణ భారంగా మారుతోంది.  

ఎందుకింత ఆలస్యం? 
సాంకేతిక విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న వారిలో 22 మంది పార్క్‌షాపు అంటెండర్లు, ఇద్దరు లెక్చర్లను క్రమబదీ్ధకరిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచి్చంది. ఇద్దరు లెక్చరర్లు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులర్‌ అయ్యారంటూ కొంతమంది కోర్టులో సవాల్‌ చేశారు. అయితే న్యాయస్థానం మాత్రం ఆ ఇద్దరు లెక్చరర్లు తప్ప మిగిలిన వారందరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. 

కానీ, సాంకేతిక విద్యాశాఖ అధికారులు మాత్రం కావాలనే జాప్యం చేస్తున్నట్టు వర్క్‌షాపు అటెంటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ పేరుచెప్పి ఒకసారి, కోర్టు కేసుల పేరు చెప్పి మరోసారి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు.   

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)