Breaking News

సిఫారసులకే సర్దుబాటు!

Published on Sun, 08/11/2024 - 05:56

సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీ­లకు రంగం సిద్ధమైంది. ఈ ప్ర­క్రియ ఆదివారం నాటికి పూర్తి కావాల్సి ఉండగా టీ­చర్, విద్యార్థుల నిష్పత్తి, సర్వీ­స్, స్టేషన్‌ అంశాల్లో ఏది ప్రామాణికంగా తీసుకోవాలన్న అంశంపై తర్జ­నభర్జనతో బదిలీలను సోమవారానికి వాయిదా వేశా­రు. పైకి మాత్రం పని సర్దుబాటు ఆధారంగా బది­లీలు అని చెబుతున్నా అంతర్గతంగా కూటమి నేతల­కు కాసులు కురిపించే ప్రక్రియగా మారిందనే ఆరో­పణలు వ్యక్తమవుతున్నాయి. తమ సిఫారసు లేఖల­తో వచ్చిన వారికి బదిలీలలో ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు మంత్రులు, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదే అదనుగా గ్రామీణ ప్రాంతాల్లో పని­చేస్తున్న ఉపాధ్యాయులు సిఫారసు లేఖలతో మండలం, జిల్లా కేంద్రాలకు లేదంటే సమీపంలోని పాఠ­శాలలకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొత్తం ప్రక్రియ జిల్లా స్థాయిలో జరుగుతుండటంతో భారీగా అక్రమాలకు ఆస్కారముందని పలు ఉ­పా­«­ద్యా­య సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్లు, సె­కండరీ గ్రేడ్‌ టీచర్లు మొత్తం 29,992 మంది ఉ­పాధ్యాయులు మిగులు కనిపిస్తుండగా ఈ ఏడాది ఇ­ప్పటివరకు ఉద్యోగ విరమణ చేసిన వారు 2 వేల మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 30 మంది విద్యా­ర్థులకు ఓ టీచర్‌ ఉండాలని విద్యాశాఖ నిబంధన తేవడంతో గరిష్టంగా 4 వేల నుంచి 5 వేల మందికి బదిలీకి అవకాశముంది. ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న వారిని బదిలీల నుంచి మినహాయించారు. 

బదిలీలు 1: 20 ప్రకారం చేయాలని డిమాండ్‌ 
ఇటీవల ఉపాధ్యా­యుల అటెండెన్స్‌ యాప్‌­లో సిబ్బంది సర్వీ­సు వివ­రాల నమోదు కోసం ప్రత్యేక కాలమ్‌ జోడించారు. దీనిద్వారా ఉపాధ్యా­యు­లంతా తమ సర్వీస్‌ రికార్డు వివరాలను న­మోదు చేశారు. ఈ లెక్కల ప్రకారం స్కూ­ల్‌ అసిస్టెంట్లు (సబ్జెక్టు టీచర్లు) 8,773 మంది, ఎస్‌జీటీలు 20,469 మంది మిగులు ఉన్నట్టు తే­ల్చారు. ఎయిడెడ్‌లో మరో 750 మంది కలిపి మొ­త్తం మిగులు ఉపాధ్యాయలు 29,992 మంది ఉన్నా­రు. సర్దుబాటు బదిలీల్లో భాగంగా 30 మంది విద్యా­ర్థులకు ఓ టీచర్‌ చొప్పున ఉండేలా ప్రభుత్వం ఉత్త­ర్వులిచ్చింది. ఈ లెక్కన సర్దు­బాటు చేస్తే సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు నష్టం జరుగు­తుంది.

ప్రాథమిక పాఠ­శాలల్లో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ నిష్పత్తి­లో, ఉన్నత పాఠశాలలకు 1:45 నిష్పత్తిలో లేదా జీవో53 ప్రకారం ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చే­సు­్తన్నారు. దీనివల్ల 6 నుంచి 7 వేల మందికి అవ­కాశం లభిస్తుందంటున్నా­దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. సర్దుబాటు బదిలీల్లో సమస్య­లను పరిష్క­రించుకునేందుకు టీ­డీపీ ఎమ్మె­ల్సీ­లతో చర్చించేందుకు రావాలని ఉపా­ధ్యాయ సంఘాలను ఆహ్వా­నించినప్పటికీ తామనుకున్న వి«­దంగా ప్రక్రియ ము­గించేందుకు ప్రభుత్వం సన్నా­హాలు చేస్తోంది. సర్దు­బాటు బది­లీలు తొలుత రాష్ట్ర స్థాయి­లో చేపట్టా­లని నిర్ణయించినా అనంతరం జి­ల్లా స్థా­యిలో మండల యూని­ట్‌గా నిర్వహించేలా ఏర్పా­ట్లు చేశారు. కూట­మి నేతలు దీన్ని ఆసరాగా చేసుకు­ని తమ సి­ఫా­రసు లేఖలు తెచ్చుకున్న వారిని కోరు­కు­న్నచో­టకు పంపించాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)