Breaking News

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

Published on Fri, 01/27/2023 - 07:50

అక్కిరెడ్డిపాలెం(గాజువాక): విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌ను పాలక వర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గురువారం ఉదయం విశాఖ డెయిరీలో జరిగిన పాలకవర్గం సమావేశంలో సీనియర్‌ బోర్డు డైరెక్టర్‌ రెడ్డి రామకృష్ణ డెయిరీ తదుపరి చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌ పేరును ప్రతిపాదించగా మరో సీనియర్‌ డైరెక్టర్‌ కోళ్ల కాటమయ్యతో పాటు ఇతర పాలక వర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మా­నం చేసి ఆమోదించారు.

అనంతరం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆడారి ఆనంద్‌కుమా­ర్‌ తన తండ్రి దివంగత తులసీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ తన తండ్రి తులసీరావు విశాఖ డెయిరీ చైర్మన్‌గా గత 36 సంవత్సరాలుగా చేసిన సేవలను గుర్తు చేశారు. మేలైన పశుజాతిని, పశు దాణాను, పశు వైద్యాన్ని అందించి పాడి రైతుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

పాడి రైతులకు ఆరోగ్య సంక్షేమ పథకాలు, సేవలు అందిస్తూ విశాఖ డెయిరీను మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.  నూతన చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌కు విశాఖ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్వీ రమణ పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: లోకేశ్‌ పాదయాత్ర: ఎక్కడికక్కడ గొడవలకు దిగండి.. చంద్రబాబు కుయుక్తులు? 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)