Breaking News

ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక

Published on Mon, 05/13/2024 - 03:06

ఏఎన్‌యూ:  ఐక్యరాజ్య సమితి కాంక్షించే సుస్థిర అభివృద్ధికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ వేదికగా మారిందని,  సుస్థిర అభివృద్ధిని అంగీకరించని వారు నిజమైన అభివృద్ధికి వ్యతిరేకులేనని ఆర్థిక రంగ నిపుణులు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (కేంద్రీయ విశ్వవిద్యాలయం) సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ పాలసీ మాజీ డైరెక్టర్‌ ఆచార్య కె. రాజమోహన్‌రావు అన్నారు.

ఆర్థిక, సామాజిక రంగ విధానాల రూపకల్పన కోసం ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ప్రత్యేక సదస్సులో భారత దేశం నుంచి ప్రతినిధిగా హాజరవ్వడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా 8 దేశాలలో పర్యటించి అక్కడి ఆర్థిక అంశాలను అధ్యయనం చేసిన ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు 

సమాజాభివృద్ధికి ఏపీ విధానాలు దోహదం 
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సంపూర్ణ సమాజాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. సమాజంలో కొన్ని వర్గాలకే పరిమితమైతే అది నిజమైన అభివృద్ధి కాదనేది ఆర్థిక, సామాజిక రంగాలపై  అవగాహన ఉన్న వారెవరైనా ఒప్పుకుంటారు. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాల సంపూర్ణ సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. అందమైన భవనాలో, కొందరికో ఉపయోగపడే రెండు రంగాలకు ప్రాధాన్యమిచ్చి సంపదంతా అందులో పెట్టేయడమో, నున్నగా ఉండే రోడ్లో అభివృద్ధి కాదు.

మానవ వనరుల అభివృద్ధే నిజమైన అభివృద్ధి. ఈ ప్రపంచంలో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య వంటి 17 లక్ష్యాలను రూపొందించింది. ఆ లక్ష్యాల సాధన, అణగారిన వర్గాల అభివృద్ధికి అంకితభావంతో కూడిన సంస్కరణలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది.  

ప్రజల్లో విద్య, వైద్యం మానసిక స్థైర్యాన్ని పెంపొదిస్తాయి 
సంక్షేమం, అభివృద్ధి రెండూ వేరు కాదనే విషయం గుర్తించాలి. ఏపీలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలతో మిశ్రమ ప్రయోజనాలు ఉన్నాయి. అమ్మ ఒడి, ఆసరా, డ్వాక్రా మహిళలకు రుణాల వంటి పథకాలకు ఇస్తున్న ఆర్థిక ప్రోత్సాహం వారి సంక్షేమం, అభివృద్ధికి, వారిలో కొనుగోలు శక్తిని పెంపునకు దోహదం చేస్తున్నాయి. 

2022–23 మధ్య ఏపీలో పెరిగిన అభివృద్ధి రేటు 
ఏపీలో 2018–19 సంవత్సరం నాటికి, 2022–23 సంవత్సరానికి మధ్య  పలు రంగాల్లో ఎంతో వృద్ధి రేటు నమోదయింది. జీఎస్‌డీపీ (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రాడెక్ట్‌) వృద్ధి రేటు 11 శాతం నుంచి 16.2 శాతానికి, వ్యవసాయాభివృద్ధి 5.4 శాతం నుంచి 14.9 శాతానికి, పారిశ్రామికాభివృద్ధి రేటు 10.4 శాతం నుంచి 16.3 శాతానికి, సేవారంగ వృద్ధి రేటు 12.7 శాతం నుంచి 20.5 శాతానికి పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం రూ.1,38,299 ఉండగా ఈ ప్రభుత్వ కాలంలో రూ.2,19,518కి పెరిగింది.

ప్రజల అవసరాలు, పాలనా సంస్కరణల అమలు పేరుతో ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు అప్పులు చేశాయి. అవి కొద్ది మందికే ప్రయోజనాన్ని కలిగించాయి. ప్రస్తుత ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు రాయితీలు, స్వయం ఉపాధి ప్రోత్సాహ పథకాలు వంటి వాటి ద్వారా మన రాష్ట్రంలో నిజమైన వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతోంది. ఇప్పటి వరకు అభివృద్ధికి దూరంగా ఉన్న చాలా మంది ప్రజలు నేడు పలు పథకాల ద్వారా ఏపీలో లబ్ధి పొందుతున్నారు. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)