Breaking News

వేటగాళ్ల ఉచ్చుకు ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ వాచర్‌ బలి

Published on Mon, 10/20/2025 - 04:14

పాములపాడు: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పా­టు చేసిన విద్యుత్‌ తీగ ఉచ్చుకు తగిలి ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ వాచర్‌ మృతి చెందగా.. మరో నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ దుర్ఘటన నంద్యాల మండలం పాములపాడు మండలం బానకచెర్ల గ్రామ సమీపంలోని అడవిలో ఆదివారం జరిగింది. అటవీ అధికారుల కథనం మేరకు.. ఈ నెల 18న రాత్రి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, ప్రొటెక్షన్‌ వాచర్లు రాముడు, రాంభూపాల్, విజయ్‌కుమార్, అరుణ్‌కుమార్, లక్ష్మణ్‌నాయక్‌ విధుల్లో భాగంగా వా­హనంలో బయల్దేరారు. 

రోడ్డు పక్కన అడవిలో చెట్ల పక్కన ఒక ద్విచక్ర వాహనం కనిపించడంతో అను­మా­నం వచ్చి అడవిలోకి వెళ్లి చూశారు. దారిలో వేట­గాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగ ఉచ్చు తగలి ప్రొటె­క్షన్‌ వాచర్‌ లక్ష్మణ్‌నాయక్‌ (54) కిందపడ్డాడు. మిగతా వారు వస్తుండగా ‘విద్యుత్‌ ఉంది.. రావొద్దు’ అంటూ కేక వేసి కుప్పకూలిపోయాడు. అప్ప­టికే ఇద్దరికి స్వల్పంగా తీగ తగిలింది. లక్ష్మణ్‌నాయక్‌ను వెంటనే ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.  

వాహనంపై టీడీపీ ఎంపీ శబరి ఫొటో స్టిక్కర్‌ 
ఘటనా స్థలంలో లభించిన ద్విచక్ర వాహనం నంద్యా­ల జిల్లా మిడుతూరు మండలం తలముడిపికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వాహనంపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఫొటోతో కూడిన స్టిక్కర్‌ అతికించి ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, అటవీ అధికారులు వేటగాళ్లు ఏర్పాటు చేసిన తీగను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)