Breaking News

31 వరకు వైఎస్సార్‌ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Published on Sat, 08/26/2023 - 03:12

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ 2023 పురస్కారాలకు దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియనున్నట్లు ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ తుమ్మా విజయ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల తరహాలోనే ప్రజా సేవలో విశిష్ట సేవలను అందించి ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులతో సత్కరిస్తుందని చెప్పారు.

దరఖాస్తుదారులు తమ విజయాలు, సేవలపై ఒక పేజీకి మించకుండా సమాచారాన్ని ఇవ్వడంతో పాటు ఫోన్‌ నంబర్, ఈ–మెయిల్, చిరునామాలను పొందుపరచాలన్నారు. దరఖాస్తులను సంబంధిత విభాగాలతో పాటు, secy& political@ ap.gov. in  మెయిల్‌కు పంపాలన్నారు.

ప్రజా సేవలో విశిష్ట సేవలతోపాటు కళలు, సామాజిక సేవ, పబ్లిక్‌ అఫైర్స్, సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, సివిల్‌ సర్వీస్, స్పోర్ట్స్, తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు, గ్రామాల్లో, మురికివాడల్లో పనిచేస్తూ సరైన గుర్తింపు పొందని రాష్ట్రానికి చెందిన వ్యక్తుల్లో పొలిటికల్‌ ఎన్జీవోలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, చరిత్రలో పేరొందిన సంస్థలు, సంఘాలు దరఖాస్తుకు అర్హులని వివరించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)