Breaking News

చల్ల‘పడిన అమ్మకాలు’

Published on Tue, 05/13/2025 - 05:12

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు వేసవి అమ్మకాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే ఎయిర్‌ కండీషనర్ల (ఏసీ) అమ్మకాలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోయాయి. మే నెలలో భానుడు భగభగల స్థానంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లపడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 25న 13,117 మెగా వాట్ల గరిష్ట విద్యుత్‌ వినియోగం నమోదు కాగా అది ఇప్పుడు 10,700 మెగావాట్ల స్థాయికి పడిపోయిందంటే వాతావరణం ఏ స్థాయిలో మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

 ఫలితంగా వరుసగా నాలుగేళ్ల నుంచి గణనీయంగా పెరుగుతూ వచి్చన ఏసీల అమ్మకాలు తొలిసారి తిరుగమన దశలో నడుస్తున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా 1.50 కోట్ల ఏసీల విక్రయాలు జరగ్గా ఈ ఏడాది కనీసం 30 నుంచి 35 శాతం వృద్ధి నమోదవుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. మొత్తం ఏసీల అమ్మకాల్లో 70 శాతం అమ్మకాలు ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలోనే జరుగుతాయి. అలాంటిది ఈ ఏడాది ఏప్రిల్, మే రెండు నెలలు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని, గతేడాదితో పోలిస్తే 40–50 శాతం అమ్మకాలు తగ్గాయని సోనోవిజన్‌ ఫౌండర్‌ భాస్కర మూర్తి తెలిపారు. వాతావరణంలో వచ్చిన అకాల మార్పులతో వినియోగదారులు ఏసీ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

జూన్‌లోనూ పెరిగే ఆస్కారం లేదు..!
సాధారణంగా వేసవిలో 1600 నుంచి 1800 ఏసీలను విక్రయిస్తామని, ఈసారి ఇంత వరకు ఉక్కపోత అనేది మొదలు కాక­పో­­వడంతో అమ్మ­కాలు ఆశించిన స్థాయిలో లేవని విశా­ఖకు చెందిన ప్ర­ము­ఖ రిటైల్‌ సంస్థ ఒకటి పేర్కొంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తున్నాయన్న వార్తలతో జూన్‌లోనూ విక్రయాలు పెరిగే అవకాశాలు కనపించడం లేదంటున్నారు. గతేడాది హీట్‌వేవ్స్‌ ఎక్కువగా ఉండటంతో ఏసీ అమ్మకాలు ఆగస్టు వరకు కొనసాగాయన్నారు. మొత్తం ఏసీల అమ్మకాల్లో 23 శాతం వాటా కలిగిన దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి అంతా ఇదే విధంగా ఉందని, ఉత్తరాది మార్కెట్‌ మాత్రమే కొంత వృద్ధిని నమోదు చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అమ్మకాలు పెంచుకోవడానికి వివిధ ఆఫర్లు ప్రకటించడంతో పాటు ధరలు పెంచాలన్న నిర్ణయాన్ని  ఏసీ తయారీ సంస్థలు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి. ఇప్పటికీ మన రాష్ట్రంలో వ్యక్తిగత ఏసీలు 8.1 శాతం కుటుంబాలకు మాత్రమే ఉన్నాయి.

మిగిలిన వేసవి ఉత్పత్తులపైనా ప్రభావం  
ఎయిర్‌ కండీషనర్లే కాకుండా కూలర్లు, రిఫ్రిజరేటర్లు, శీతల పానీయాల అమ్మకాలను అకాల వర్షాలు దెబ్బతీశాయి. గతేడాదితో పోలిస్తే రిఫ్రిజిరేటర్ల అమ్మకాల్లో 10 నుంచి 15 శాతం తగ్గుదల కనిపిస్తోంది. శీతల పానీయాల విషయంలో 15 నుంచి 20 శాతం వరకు తగ్గుదల ఉంది. వాతావరణ మార్పులే కాకుండా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం కూడా అమ్మకాలు తగ్గడానికి కారణంగా కొంతమంది రిటైలర్లు పేర్కొంటున్నారు. టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, గ్రైండర్లు వంటి అమ్మకాలు కూడా గతేడాది పోలిస్తే తక్కువగానే జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)