Breaking News

ఐఐటియన్‌లకు అందని జాబ్‌!

Published on Sat, 03/29/2025 - 04:33

సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టి­ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో అసాధారణ క్షీణత కనిపిస్తోంది. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే సగానికి పైగా ఐఐటీల్లో సగటున 10% మేర తగ్గుదల నమో­దవడం గమనార్హం. తొలి తరం ఐఐటీల్లో ఒక­టైన ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో మాత్రమే స్వ­ల్పంగా 2.28% తగ్గుదల కనిపించింది. 

మిగిలిన అన్నింటిలోనూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల పరిస్థితి దారు­ణంగా ఉంది. మొత్తం 23 ఐఐటీలు ఉండగా.. చాలా ఐఐటీల్లో 2022–23లో మొదలైన తగ్గుదల... 2023–24లోనూ కొనసాగింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లోనూ ప్లేస్‌మెంట్ల క్షీణతపై పార్లమెంట్‌ స్టాడింగ్‌ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. దీనిని అసాధారణ తగ్గుదలగా గుర్తించింది. దేశంలో విద్యపై ఖర్చు భూటాన్, మాల్దీవుల కంటే తక్కువగా ఉందని అభిప్రాయపడింది.  

తొలి తరం ఐఐటీల్లోనూ ఎదురుగాలే..
» తొలి తరం ఐఐటీల్లోనూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల తగ్గుదల నమోదవుతోంది. ప్లేస్‌మెంట్ల కోసం నమోదు చేసుకునేవారు తగ్గుతుంటే.. అందులోనూ ఉద్యోగాలు పొందేవారు మరింత తగ్గిపోతున్నారు.
»  తాజా గణాంకాల ప్రకారం ఐఐటీ రూర్కీలో ప్లేస్‌మెంట్లు గణనీయంగా పడిపోయాయి. 2021–22లో 98.54 శాతం ఉన్న ప్లేస్‌మెంట్లు... 2023–24కు వచ్చేసరికి 79.66 శాతానికి తగ్గాయి. అంటే ఏకంగా 18.88 శాతం తగ్గిపోయాయి. ఐఐటీ ఢిల్లీలో 15 శాతం, ఐఐటీ బొంబాయిలో 12.72 శాతం మేర క్షీణత నమోదైంది. ఐఐటీ మద్రాస్‌లో 12.42 శాతం, ఐఐటీ కాన్పూర్‌లో 11.15 శాతం ప్లేస్‌మెంట్లు పడిపోయాయి.
»  ఐఐటీ భువనేశ్వర్‌లో 2021–22తో పోలిస్తే 2022–23లో ప్లేస్‌మెంట్లు మెరుగైనప్పటికీ.. 2023–24లో మాత్రం 7.58 శాతం తగ్గుదల నమోదైంది. 
»  రెండో తరం ఐఐటీల్లోనూ పరిస్థితి చెప్పుకోతగ్గట్టు లేదు. 2008–09 మధ్య స్థాపించిన ఐఐటీల్లో హైదరాబాద్‌ అత్యంత ఎక్కువ క్షీణతను (17.17 శాతం) నమోదు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ మండీ (14.1శాతం), రోపర్‌ (13.15శాతం), ఇండోర్‌ (11.03శాతం) ఉన్నాయి. 
» ఇక 2015–16 మధ్య స్థాపించిన మూడో తరం ఐఐటీల్లోనూ ప్లేస్‌మెంట్ల పరిస్థితి ఏమీ బాగాలేదు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023–24లో ఐఐటీ జమ్మూలో 21.83 శాతం ప్లేస్‌మెంట్లు తగ్గిపోయాయి.

ఆర్థిక మందగమనం ఓ కారణం..
కోవిడ్‌ తర్వాత కూడా ఐఐటీల్లో క్యాంపస్‌ నియామకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగనమనం కారణంగా రెండేళ్లుగా ప్లేస్‌మెంట్‌లపై ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఉన్నత విద్య వైపు వెళ్లడం, స్టార్టప్‌లపై దృష్టి సారించడం వంటి కారణాల వల్ల కూడా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు తగ్గుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. 

క్యాంపస్‌ కొలువులు మార్కెట్‌ ట్రెండ్‌లపై ఆధారపడి ఉన్నప్పటికీ, విభాగాల వారీగా కొత్త మార్గాలను కనుగొని తదనుగుణంగా ఉపాధి పొందే అవకాశాలను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని సూచిస్తున్నారు. గత సంవత్సరం చాలా ఐఐటీలు తమ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు వెల్లడించలేదు. 

అయితే, సెప్టెంబర్‌లో ఐఐటీ బొంబాయి విడుదల చేసిన నివేదిక ప్రకారం... గత పరిస్థితులతో పోలిస్తే తక్కువ మంది విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు పొందారని, ఇందులోనూ అత్యల్ప ప్యాకేజీ ఏడాదికి రూ.4లక్షలకు పడిపోయిందని పేర్కొంది. దీనిని బట్టి చూస్తే ఉద్యోగ మార్కెట్‌లో ఆందోళనకర మార్పు కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఐఐటీల్లో ప్లేస్‌మెంట్స్‌ శాతంలో తగ్గుదల ఇలా...
ఐఐటీ    2021–22    2023–24
ఖరగ్‌పూర్‌    86.79        83.91
బొంబాయి    96.11        83.39
మద్రాస్‌    85.71        73.29
కాన్పూర్‌    93.63        82.48
ఢిల్లీ    87.69        72.81
గౌహతి    89.77        79.10
రూర్కీ    98.54        79.66
వారణాసి    83.15        88.04
ధన్‌బాద్‌    87.89        75.38
గాంధీనగర్‌    91.85        82.39
భువనేశ్వర్‌    94.78        86.07
హైదరాబాద్‌    86.52        69.33
జోద్‌పూర్‌    96.59        92.98
రోపర్‌    88.49        75.34
పాట్నా    97.65        90.03
ఇండోర్‌    96.74        85.71
మండీ    98.13        84.03
పాలక్కాడ్‌    97.27        82.03
తిరుపతి    94.57        86.57
జమ్మూ    92.08        70.25
భిలాయ్‌    89.92        72.22
గోవా    98.65        92.73
ధార్వాడ్‌    90.20        65.56
–––––––––––––––––––––––––––––
   మొత్తం      449/410  

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)