Breaking News

1.83 కోట్ల మంది ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే!

Published on Sat, 08/17/2024 - 04:49

సాక్షి, అమరావతి: ఇప్పటికే ఆధార్‌ కార్డు ఉన్నప్పటికీ.. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 1,83,74,720 మంది తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉందని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ఇండియా తేల్చింది. చిన్న వయసులో ఆధార్‌ కార్డు పొందిన వారు అప్పట్లో నమోదు చేసుకున్న వేలిముద్రలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అలాంటి వారు 18 ఏళ్ల వయసు దాటిన అనంతరం మరోసారి కొత్తగా తమ వేలిముద్రలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. 

అలాంటి వారు 48,63,137 మంది ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది. దీనికి తోడు.. ఎవరైనా ఆధార్‌కార్డు పొందిన తర్వాత పదేళ్ల కాలంలో కనీసం ఒక్కసారైనా ఆధా­ర్‌లో అంతకు ముందు పేర్కొన్న అడ్రస్‌తో పాటు ఫొటో­లను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉండగా.. ఆ కేటగిరిలో 1,35,07,583 మంది వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది.

ఐదు రోజులపాటు ఆధార్‌ ప్రత్యేక క్యాంపులు 
ఇటీవల జన్మించిన వారికి తొలిసారి ఆధార్‌కార్డుల జారీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఆధార్‌ కార్డులు తీసుకుని నిబంధనల ప్రకారం తమ వివరాలను మరోసారి తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాల్సిన 1.83 కోట్ల మంది కోసం ఈ నెల 20 నుంచి  ఐదు రోజుల పాటు ప్రభుత్వం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహించనుంది.

దేశవ్యాప్తంగా ఆధార్‌ జారీచేసే యూఐడీఏఐ సంస్థ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతరెండేళ్లుగా ప్రతినెలా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆ«ధ్వర్యంలో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తుంది. ఆగస్టులో ఆధార్‌ ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ శివప్రసాద్‌ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

అవసరమైనచోట కాలే­జీలు, పాఠశాలలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని.. తగిన ప్రచారం కల్పించడానికి కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు.  

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)