Breaking News

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా.. ఉంటుందా? ఉండదా?

Published on Sat, 02/22/2025 - 14:28

విజయవాడ, సాక్షి: గ్రూప్‌ 2(Group 2) అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. మెయిన్స్‌ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళం నెలకొంది. అందుకు ఏపీ ప్రభుత్వం చేసిన పనే కారణం. మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ APPSC సెక్రటరీకి లేఖ రాసింది. అయితే స్వయంగా ప్రభుత్వమే లేఖ రాసినా బోర్డు నుంచి ఇంతదాకా స్పందన లేదు. 

షెడ్యూల్‌ ప్రకారం రేపు(ఫిబ్రవరి 23, ఆదివారం) గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష ఉంది. రోస్టర్‌ తప్పులను సరి చేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఆ పరీక్షను వాయిదా వేయాలంటూ శనివారం ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. మార్చి 11న రోస్టర్‌ అంశంపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అఫిడవిట్‌ వేసేందుకు సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే.. 

మరోపక్క మెయిన్స్‌(Group 2 Mains Exam) వాయిదా పడింది అంటూ వస్తున్న కథనాలను ఇంతకుముందు బోర్డు కొట్టిపారేసింది. యధావిథిగా రేపు(23 ఫిబ్రవరి) పరీక్ష జరుగుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విజ్ఞప్తిని బోర్డు పరిగణనలోకి తీసుకుంటుందా? ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

చట్టరీత్యా చర్యలు తప్పవు

పలు సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా అని సర్కులేట్ అవుతున్న వార్త అవాస్తవం. ఏపీపీఎస్సీ నుండి అందిన సమాచారం మేరకు గ్రూప్ -2 పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం.
:::తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)