Breaking News

విన్నారు.. ఆదుకున్నారు..

Published on Sat, 12/16/2023 - 05:24

శ్రీకాకుళం పాత బస్టాండ్‌: శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు గురు­వారం వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి తన మంచి మనస్సుని చాటుకున్నారు. సాయం కోరి వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఒక్కరోజులోనే ఆయన వారికి ఆర్థిక సాయాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నిర్మించిన వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రి, వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రిని పలువురు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.

మందుల కోసం, ఇతర వైద్య అవసరాల కోసం సాయం కోరారు. వారి కష్టాలు విన్న సీఎం వెంటనే సాయం చేయా­లని అక్కడే ఉన్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో ఎనిమిది మందికి రూ.9లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు.

సాయం అందుకున్న వారి వివరాలు
♦ పొందూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన బోను సంతోషి పదేళ్లుగా తేలికపాటి పక్షవాతం, తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడు­తోంది. ఆమె సీఎంను కలిసి ఆర్థిక సాయం కోరడంతో ఆమెకు రూ.2 లక్షలు అందించారు.
♦పెద్ద శ్రీపురం సచివాలయ పరిధికి చెందిన మేరపాటి తులసీదాసు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సీఎంను కలిసి కష్టం చెప్పుకోగా ఆయనకు రూ.లక్ష అందించారు.
♦సనపల హేమంత్‌కుమార్‌ అనే వ్యక్తి వంశ­పారంపర్య హైపర్‌ కొలోస్ట్రిమియా అనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యశ్రీలో తనకు చికిత్స అందేలా చూడాలని సీఎంను కోరారు. వెంటనే ఆయనకు రూ.లక్ష చెక్కును కలెక్టర్‌ అందజేశారు.
♦ రాజాం మండలానికి చెందిన అడపా యోగేశ్వరరావు సీఎంను కలిసి తనకు గుండెలో రంధ్రాలు, జన్యుపరమైన సమస్యకు ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స జరిగిందని, ఆర్థిక సాయం చేయాలని కోరారు. దీంతో ఆయనకు రూ.లక్ష మంజూరు చేశారు.
♦ అలాగే.. వితిక (అధిక రక్తస్రావం), సాయికృష్ణ (మానసిక వ్యాధి), ఎం. సాత్విక్‌ (జన్యుపరమైన సమస్యలు), అధిక కొలెస్ట్రాల్‌) కొమర పోలరాజు (ఊపిరితిత్తుల క్యాన్సర్‌ 4వ దశ)లు కూడా ముఖ్యమంత్రిని కలిసి సాయం అభ్యర్థించగా.. వారికి కలెక్టర్‌ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. 
♦ ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త పి. ప్రకాశరావు, కొవ్వాడ ఎస్‌డీసీ తహసీల్దార్‌ బీవీ రమణ, డి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పి. అమల, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)