Breaking News

ఒకేసారి 72 వేల మంది బదిలీ

Published on Sat, 06/14/2025 - 04:52

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేచోట ఐదేళ్లుగా పనిచేస్తున్న 72 వేల మందికి పైగా ఉద్యోగులకు స్థానచలనం తప్పదు.  దాదాపు 80 వేల మంది సచివాలయాల ఉద్యోగులకు ఈ విడతలో బదిలీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 

ఒకేచోట ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోకపోయినా వారు బదిలీకాక తప్పదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీల ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు.. రిక్వెస్టు బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి శనివారం ఉదయం నుంచి ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెప్పారు.  

70 శాతానికి పైగా బదిలీ.. 
ప్రస్తుతం 1.09 లక్షల మంది ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఈ ఏడాది 70 శాతం మందికి పైగా స్థానచలనం ఉంటుందని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈనెల 30లోగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేస్తూ బదిలీ మా­ర్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కె. భాస్కర్‌ గురువారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.  

ఆఫ్‌లైన్‌ విధానంలోనే బదిలీల ప్రక్రియ.. 
ఈసారి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్‌లో చేపట్టాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను నాటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టింది. 

అయితే, ఇప్పుడు ఒకే విడతన దాదాపు 80 వేల మందిని ఆఫ్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించడమంటే, భారీగా పైరవీలకు తెరలేపినట్లేనని సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేసే అవకాశముందని.. దీనివల్ల ఉద్యోగులు రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)