స్మార్ట్‌ వరల్డ్

Published on Sun, 08/18/2024 - 06:16

ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతోంది. కమ్యూనికేషన్, వెబ్‌ బ్రౌజింగ్, నావిగేషన్, వినోదం వంటి సేవలతోపాటు ఆర్థిక లావాదేవీలు, సామాజిక అవసరాల విషయంలో విస్తృత మార్పులు రావడంతో ప్రతి వ్యక్తికి స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసర వస్తువుగా మారింది. ఒక వ్యక్తి వద్ద ఒకటి కంటే ఎక్కువ కూడా స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. దీంతో 2023లో ప్రపంచ వ్యాప్తంగా 692 కోట్లు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. పట్టణాల్లో 83 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 78 శాతం స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

ఇదే ఒరవడి కొనసాగితే 2025 నాటికి ప్రపంచ జనాభాలో 90.33 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉంటారని యూరప్‌కు చెందిన ఈ–కామర్స్‌ సేవలు అందిస్తున్న ఒబెర్లో అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. 2026 నాటికి 752 కోట్ల వరకు స్మార్ట్‌ఫోన్లు వినియోగ­దారుల చేతుల్లో ఉంటాయని ఆ సంస్థ అంచనా వేసింది. చైనాలో గత ఏడాది వరకు అత్యధికంగా 97.46 కోట్లు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో అత్యల్పంగా 5 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయితే అమెరికా(27.61కోట్లు) కన్నా దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా మనదేశంలో 65.90 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి.    – సాక్షి, అమరావతి

ఫోన్‌లోనే ఇంటర్నెట్‌ వినియోగం అత్యధికం...
స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఇంటర్నెట్‌ వినియోగం సులభమైంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 200 కోట్ల మంది (57.14శాతం) స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యాక్సెస్‌ చేశారు. ఇది 2025 నాటికి 72.6శాతాకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2023లో నెలవారీ సగటు డేటా వినియోగం 14 జీబీగా ఉంటే.. 5జీ అందుబాటులోకి రావడంతో 2026 నాటికి 35జీబీకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ ఫోన్ల వినియోగం ఇలా...
⇒ 83% సంభాషణలతో పాటుగా ఈ–మెయిల్, ఫొటోలు తీసుకోవడం
⇒ 76% ఇంటర్నెట్‌ సర్ఫింగ్‌
⇒ 73% బ్రౌజింగ్, మ్యాపింగ్, నావిగేషన్‌
⇒ 60% ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌
⇒ 59% వీడియో కాల్స్‌ మాట్లాడటం
⇒ 58% వీడియోలు తీసుకోవడం
⇒ 71% ఆన్‌లైన్‌ షాపింగ్‌
⇒ 67% సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం, చూడటం
⇒ 58% వార్తలు చదవడం/ సమాచారం ఇవ్వడం
⇒ 57% సాధారణ ప్రయోజన యాప్‌లు
⇒ 66% పాడ్‌ క్యాస్ట్‌లు
⇒ 52% గేమ్‌లు ఆడడం
⇒ 44% లాంగ్‌ వీడియోలు చూడటం
⇒ 65% షార్ట్‌ వీడియోలు చూడటం
⇒ 35% ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌లు ఆడటం 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)