Breaking News

స్వల్ప వేతన జీవులే సింహభాగం!

Published on Sat, 08/17/2024 - 04:45

సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగుల జీతాలు అరకొరగానే ఉంటున్నాయని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. దేశంలో నెల జీతం మీద ఆధారపడుతున్న వారిలో దాదాపు 68 శాతం మంది నెలకు రూ.20 వేల లోపు జీతగాళ్లేనని కూడా తెలిపింది. కేంద్ర గణాంక శాఖ ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్‌) తాజా నివేదిక దేశవ్యాప్తంగా నిరుద్యోగిత పెరుగుతోందని కూడా పేర్కొంది. ఉద్యోగుల జీతాలపై కీలక అంశాలను వెల్లడించింది. 

దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత రంగాల్లో కలిపి దేశం మొత్తం మీద 8.50 కోట్ల మంది నెల జీతం మీద ఆధారపడి జీవిస్తున్నారని ఆ నివేదిక తెలిపింది. దేశంలో నెలకు రూ.70 వేలకు పైగా జీతం తీసుకుంటున్నవారు కేవలం 2.6 శాతం మందే ఉన్నారంది. అలాగే, దేశంలో నిరుద్యోగిత క్రమంగా పెరుగుతోందని పీఎల్‌ఎఫ్‌ఎస్‌ నివేదిక తెలిపింది. దేశంలో 27 రంగాల్లో ఉద్యోగ కల్పన పరిస్థితులను విశ్లేషించి నివేదిక వెల్లడించింది. 

ఆ ప్రకారం 2022–23 కంటే 2023–24లో దేశంలో 4.66 కోట్ల మంది నిరుద్యోగులు పెరిగారు. 2022–23లో దేశంలో 59.67 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా... 2023–24లో 64.33 కోట్లకు చేరారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 1 శాతం తగ్గగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నిరుద్యోగిత 3శాతం పెరిగింది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)