అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
Breaking News
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
AP: జాక్పాట్ తగిలింది.. వలకు చిక్కిన 600 కిలోల చేప
Published on Tue, 02/28/2023 - 07:32
ఎస్.రాయవరం (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ముక్కుడు టేకుగా పిలిచే ఈ చేప సుమారు 600 కిలోల బరువు ఉంది. దీని విలువ సుమారు రూ.2 లక్షలపైనే. సముద్రంలో వలకు చిక్కిన ఈ చేపను మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు లాక్కొచ్చారు.
అంత ఖరీదైన చేపను స్థానికంగా కొనే నాథుడు లేక కాకినాడ, విశాఖపట్నంలోని చేపల వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. ఈ రేవులో ఇంత పెద్ద చేప మొదటిసారిగా దొరికిందని, అనుకున్న ధర రాకపోతే చేపను సముద్రంలో విడిచిపెడతామని మత్స్యకారులు చెప్పారు. ప్రస్తుతం శారద, వరాహ నదుల కలయిక మొగలో నీటిలో వల తాడుతో బంధించి ఉంచారు.
#
Tags : 1